UP Crime News: ఈ మధ్యకాలంలో ప్రేమ-పెళ్లిళ్లు విపరీతంగా జరుగుతున్నాయి. కొన్నాళ్లు విభేదాలు వచ్చి విడిపోతున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. అప్ కోర్సు.. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు ఆడపిల్లను ఒప్పించి పెళ్లి చేసినా, ఆ కాపురం సజావుగా సాగిన సందర్భం కనిపించ లేదు. ఫలితంగా నిందితులు అవుతున్నారు.
దిలీప్-ప్రగతి పెళ్లి
తాజాగా యూపీలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. పెళ్లయిన రెండు వారాలకే భర్తను చంపేసింది భార్య. అది కూడా ప్రేమించిన లవర్స్ కోసం. సంచలనం రేపిన ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త హత్య వెనుక అసలేం జరిగింది? దీనికి స్కెచ్ వేసిందెవరు? ఇంకాస్త డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్లొద్దాం.
యూపీ ఔరాయా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల దిలీప్ యాదవ్‌కు రెండు వారాల కిందట 22 ఏళ్ల ప్రగతి యాదవ్‌తో పెళ్లి జరిగింది. పెద్దలు దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఇద్దరు అందంగా ఉంటారు. పిల్లలు ఓకే అన్న తర్వాతే పెళ్లికి మొగ్గు చూపారు ఇరు కుటుంబాలు. కట్న కానుకల కిందట అల్లుడికి బాగానే ముట్టుజెప్పారు అత్తింటివారు.
ప్రగతి మనసులో ఆ ఒక్కడు
అయితే ప్రగతి తన మనసులో ఏంముందో కనీసం తల్లిదండ్రులకు చెప్పలేదు. కూతురు మనసులో ఏమందో కనీసం తల్లిదండ్రులు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇక అమ్మాయి జీవితం చూడాల్సిన అవసరం లేదనుకున్నారు తల్లిదండ్రులు.
ALSO READ: బెంగుళూరు రియల్టర్‌ని చంపిన అత్త, మత్తు ఇచ్చి ఆపై కత్తితో పొడిచి
పెళ్లికి ముందు ప్రగతికి ఓ లవర్ ఉన్నాడు. అతడి పేరు అనురాగ్ అలియాస్ మనోజ్. పెళ్లయిన నుంచి కాస్త భార్తతో చిరాకుగా వ్యవహరించేది ప్రగతి. కానీ, అసలు విషయం భర్తకు తెలియలేదు. ఈ క్రమంలో భర్తను చంపాలని ప్రగతి భావించింది. ఈ విషయాన్ని తన ప్రియుడు అనురాగ్ చెవిలో ఊదింది.
భర్తను హత్య చేసేందుకు లవర్స్‌తో స్కెచ్
ఇంకేముంది.. పెళ్లయినా ప్రగతి తనను వదిలి ఉండలేక పోతుందని భావించాడు. చివరకు ప్రగతి ఆమె లవర్ అనురాగ్ కలిసి దిలీప్ హత్యకు పథకం వేశారు. భర్త దిలీప్‌ని చంపాలని రామ్‌జీ చౌదరీ అనే కాంట్రాక్ట్ కిల్లర్‌కి చెప్పారు. అడ్వాన్సుగా కిల్లర్‌కు రెండు లక్షల రూపాయలు ఇచ్చేశారు.
మార్చి 19న తన పొలంలో పని చేస్తున్న సమయంలో దిలీప్‌పై కాంట్రాక్టు కిల్లర్ రామ్‌జీ చౌదరీ దాడి చేశాడు. ఆపై అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి కొన ఊపిరితో పడి ఉన్నాడు. ఈ సమాచారం స్థానికుల ద్వారా దిలీప్ కుటుంబానికి తెలిసింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడ్ని స్థానిక బిధౌనాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తరలించారు.
దిలీప్ ఆరోగ్యం క్షీణించడంతో అదే రోజు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పలు ఆసుపత్రులు తిప్పారు. చివరికి మార్చి 20న ఔరాయాలో మరో ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మార్చి 21న దిలీప్ ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల విచారణలో అసలు గుట్టు బయటకు
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దిలీప్‌ని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినా ఫలితం లేకపోయింది. దిలీప్ భార్యపై అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. హత్య వెనుక సూత్రధారి ప్రగతి అని తేలిపోయింది. ఆమెతోపాటు లవర్ అనురాగ్, కిల్లర్ రామ్‌జీలు అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి.