Girlfriend – Boyfriend: డబ్బు కోసం సొంతవారిని చంపడం ఇటీవల కామన్ అయిపోయింది. ఆస్తి కోసం బంధాలను మరచి, కుటుంబ సభ్యులపై దాడులు, హత్యలు చేస్తున్న ఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. డబ్బు మనిషి వ్యక్తిత్వాన్ని మరిచి దురాశకు బానిసను చేస్తోంది. సొంత తల్లిదండ్రులు, సోదరులు, జీవిత భాగస్వాములపై కూడా కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. గత రెండు నెలల వ్యవధి దేశంలో భర్తను చంపిన భార్యలు, ప్రియుడిని చంపిన ప్రియురాలు తదితర ఘటన చాలా చోటుచేసుకున్నాయి. సమాజంలో ఇలాంటి ఘటనలు తగ్గడానికి మానవీయ విలువలు, ఆర్థిక నిర్వహణపై అవగాహన పెంచినా మార్పు రావడం లేదు. తాజాగా డబ్బు కోసం ఓ యువతి ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ నే కిడ్నాప్ చేసిన ఘటన బెంగుళూరు లో చోటుచేసుకుంది. దుబాయికి చెందిన ఓ ట్రావెల్ సంస్థకు మేనేజర్ గా పని చేస్తున్న లారెన్స్ మెల్విన్ ను తన గర్ల్ ఫ్రెండ్ మహిమావత్ బెంగుళూరులో కిడ్నాప్ చేయించింది.
లారెన్స్ మెల్విన్ అనే వ్యక్తి దుబాయ్‌కు చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్. అతను బెంగళూరులోని తన గర్ల్ ఫ్రెండ్ మహిమావత్ ను కలవడానికి ఒక క్లబ్‌కు వెళ్లాడు. మహిమావత్ అతడిని కలుద్దామని.. క్లబ్ కు పిలిచింది. అయితే.. క్లబ్‌కు వెళ్లిన తర్వాత, కొందరు వ్యక్తులు అతడిని బలవంతంగా ఎత్తుకెళ్లి ఎనిమిది రోజుల పాటు బంధించారు. ఈ కిడ్నాప్‌లో మహిమావత్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. కిడ్నాపర్లు లారెన్స్ నుంచి ఒక లక్ష రూపాయల నగదు, రెండు ఐఫోన్‌లను దోచుకున్నారు. అంతటితో ఆగకుండా.. అతడి కుటుంబం నుంచి 2.5 కోట్ల రూపాయలను అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటన లారెన్స్‌కు మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని కలిగించింది. అతడు బంధించబడిన సమయంలో ఎదుర్కొన్న భయాందోళనలు, ఒత్తిడి అతడి జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది.
ALSO READ: CM Chandrababu Naidu: దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ మన ఏపీలో.. ఇక లక్షల కోట్లల్లో పెట్టుబడులు
లారెన్స్ సోదరి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు వేగంగా రియాక్ట్ అయ్యారు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి.. ఈ కిడ్నాప్ కేసును ఛేదించారు. మహిమావత్‌తో సహా నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన దేశంలోనే కాకుండా.. అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టించింది. ఎందుకంటే లారెన్స్ దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి కావడం వల్ల ఈ కేసు సంచలనంగా మారింది. ఈ సంఘటన వ్యక్తిగత సంబంధాలపై అత్యధిక నమ్మకం ఉంచడం వల్ల కలిగే ప్రమాదాలను హెచ్చరిస్తుంది. మహిమావత్ లారెన్స్‌ను మోసం చేయడం ద్వారా, అతడి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టింది. పోలీసుల ఈ సత్వర చర్యలు బాధితుడికి న్యాయం చేయడంలో కీలకమైనవి. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
ALSO READ: Indian Railway Notification: ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు.. రూ.44,900 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే