BigTV English

Police SI Hayathnagar: భ‌ర్త వేధిస్తున్నాడ‌ని పోలీస్ స్టేష‌న్ వెళితే ఎస్సై వేధింపులు.. రాజ‌కొండ సీపీపి మ‌హిళ ఫిర్యాదు

Police SI Hayathnagar: భ‌ర్త వేధిస్తున్నాడ‌ని పోలీస్ స్టేష‌న్ వెళితే ఎస్సై వేధింపులు.. రాజ‌కొండ సీపీపి మ‌హిళ ఫిర్యాదు

Police SI Hayathnagar: మ‌హిళ‌ల‌ను ర‌క్షించాల్సిన పోలీసులే వారిని వేధింపుల‌కు గురిచేయడం ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఇటీవ‌ల భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఓ ఎస్సై మ‌హిళ‌ను లైంగికంగా వేధించిన సంగ‌తి తెలిసిందే. మొన్న హైదరాబాద్ లోని వ‌న‌స్థ‌లిపురంలో ఓ కానిస్టేబుల్ మ‌హిళ‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఇవి మ‌ర‌వ‌క‌ముందే హైద‌రాబాద్ లో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. భ‌ర్త వేధింపులు త‌ట్టుకోలేక న్యాయం కోసం మ‌హిళ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లింది.


Also read: సజ్జల భార్గవ్ రెడ్డి, జగన్ బంధువు అర్జున్ రెడ్డికి 41A నోటీసులు.. త్వ‌ర‌లోనే అరెస్ట్?

అక్క‌డ న్యాయం చేయాల్సిన ఎస్సై ఆ ప‌నిచేయంకుండా ఫోన్ నంబ‌ర్ తీసుకుని తాను కూడా వేధించ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో బాధితురాలు క‌మిష‌న‌ర్ ను ఆశ్ర‌యించి న్యాయం చేయాల‌ని వేడుకుంది. వివ‌రాల్లోకి వెళితే… హ‌య‌త్ న‌గ‌ర్ లో ఓ మ‌హిళ‌ను భ‌ర్త వేధింపుల‌కు గురి చేయ‌డంతో హయ‌త్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి భ‌ర్త‌పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో ఫోన్ నంబ‌ర్ తీసుకున్న ఎస్ఐ సైదులు నీ కేసు నేను ప‌రిష్క‌రిస్తా.. మీ ఇంటికి వ‌స్తా అంటూ ఫోన్లు చేసి వేధించ‌డం మొద‌లు పెట్టాడు.


త‌న భ‌ర్త మూడు తులాల బంగారంతో పాటు రూ.2 ల‌క్ష‌ల‌ను ఇంటి నుండి తీసుకువెళ్లాడ‌ని ఫిర్యాదు చేస్తే రూ.65వేలు మాత్ర‌మే తీసుకెళ్లిన‌ట్టు ఫిర్యాదులో పేర్కొనాలని చెప్పాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో చెప్పు వ‌స్తా.. అంటూ వాట్సాప్ కాల్స్ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో స్టేష‌న్ కు పిలుపించుకుని ఎవ‌ర‌కీ చెప్పొంద్ద‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో వ‌స్తాడేమోన‌ని ఎంతో బ‌య‌ప‌డిపోయింది. దీంతో ఆ మ‌హిళ రాజ‌కొండ క‌మిష‌న‌ర్ సుధీర్ బాబును క‌లిసి ఫిర్యాదు చేసింది. గ‌త 40 రోజులుగా త‌న‌ను ఎస్సై వేధిస్తున్నాడ‌ని ఫిర్యాదులో పేర్కొంది.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×