Crime News : ఇటీవల ఒకడు తన భార్యను కుక్కర్‌లో పెట్టి ఉడికించేశాడు ఒకడు. ఓ భార్య తన భర్త బాడీ పార్ట్స్‌ను డ్రమ్‌లో వేసి సిమెంట్‌తో పూడ్చేసింది. ఇలా ఇటీవల కాలంలో క్రైమ్ విధానం వింత పోకడలు పోతోంది. ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ ఇలాంటివి కామన్‌గా మారాయి. అలాంటి దారుణమే ఫ్రాన్స్‌లోనూ జరిగింది. ఓ వ్యక్తి ఇంటికి దోపిడీకి వెళ్లి.. అతన్ని లేపేసి.. శరీరాన్ని ముక్కలుగా కోసేసి.. కూరగాయలతో కలిపి కర్రీ చేసేశాడు ఆ దుర్మార్గుడు. దీనికి అతడి భార్య కూడా హెల్ప్ చేయడం మరింత దారుణం.
అసలేం జరిగిందంటే..
69 ఏళ్ల ఫిలిప్ ష్నైడర్. ఫ్రెంచ్ చెఫ్. సొంతంగా రెస్టారెంట్ కూడా ఉంది. అతనికి భార్య పేరు కాబౌబాస్సీ, 45 ఏళ్లు. అప్పటికే వాళ్లు తాగుడుకు, డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం పక్కింట్లో ఉండే 60 ఏళ్ల జార్జెస్ మెచ్లర్ ఇంటికి దోపిడీకి వెళ్లారు. మెచ్లర్‌ను కట్టేసి.. గొంతు, నోరు బిగించారు. ఆ తర్వాత ఇల్లు మొత్తం దోచుకున్నారు. వెళ్లే ముందు చూడగా.. ఊపిరి ఆడక మెచ్లర్ చనిపోయాడు. దెబ్బకు హడలిపోయింది ఆ దోపిడీ జంట. ఆ విషయం బయటపడకుండా డెడ్ బాడీ మాయం చేయాలని అనుకున్నారు.
మనిషి మాంసంతో వంటకం..
స్వతహాగా చెఫ్ అయిన ష్నైడర్‌కు ఓ కిరాతకమైన ఐడియా వచ్చింది. బాడీని ముక్కలుగా నరికేశాడు. ఆ భాగాలను కూరగాయ ముక్కలను ఓ కుండలో వేసి బాగా ఉడికించాడు. ఎముకల నుంచి మాంసం విడిపోయేంతగా బాగా కుక్ చేశాడు. అతను ఆ వంటకాన్ని అంతకుముందు నేపాల్‌లో నేర్చుకున్నాడట. జంతు మాంసం, కూరగాయలు కలిపి నేపాలీయులు ఓ సంప్రదాయ వంటకం వండుతారట. అయితే, అదే రెసిపీలో చికెన్, మటన్‌కు బదులు మనిషి మాంసం వేసి.. వెజిటెబుల్స్ మిక్స్ చేసి.. అలా వంట వండేశాడు. తల, చేతులు, కాళ్లను మాత్రం వండలేదు అతను. హతుడి వ్యాన్‌ను సైతం దొంగలించి.. అందులోనే మిగిలిన బాడీ పార్ట్స్ ను దూరంగా తీసుకెళ్లి తగలబెట్టాడు. ఆ క్రమంలో కొన్ని మాంసం ముద్దలు, రక్తం వ్యాన్‌లో చెల్లాచెదరుగా పడిపోయాయి.
హంతకులు ఎలా దొరికారంటే..
కట్ చేస్తే.. తన తండ్రి కనిపించడం లేదంటూ హతుడి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు చనిపోయిన వ్యక్తి వ్యాన్‌ను ట్రేస్ చేశారు. హంతకులు అందులోనే పట్టుబడ్డారు. పోలీసులు ప్రశ్నిస్తే చనిపోయిన వ్యక్తే తమకు ఈ వ్యాన్‌ను అమ్మేశాడని అబద్దం చెప్పారు. కారులో రక్తపు మరకలు, డెడ్‌బాడీ ముక్కలు దొరకడంతో ఆ హంతకుల జంటను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయమంతా చెప్పేశారు. దొంగతనానికి మెచ్లర్ ఇంటికెళ్లామని.. అనుకోకుండా అతను చనిపోయాడని చెప్పాడు ష్నైడర్. సాక్షాలు మాయం చేసేందుకే.. డెడ్ బాడీని ముక్కలుగా కట్ చేసి.. కూరగాయలతో కర్రీ వండేశానని అంగీకరించాడు. అయితే, అతని భార్య మాత్రం ఇప్పటికీ తనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తోంది.