BigTV Exclusive : వడ్డే నవీన్ (Vadde Naveen).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2000 సంవత్సర కాలంలో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన ఎవరో కాదు ప్రముఖ తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేష్ (Vadde Ramesh) తనయుడు. 1996లో వచ్చిన ‘క్రాంతి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నవీన్.. ఆ తర్వాత 1997లో ‘కోరుకున్న ప్రియుడు’, ‘పెళ్ళి’, 1998లో ‘మనసిచ్చి చూడు’, ‘లవ్ స్టోరీ 1999’, ‘స్నేహితులు’ వంటి సినిమాలు చేసి పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే 1997లో ఈయన చేసిన ‘పెళ్లి’ సినిమాతోనే ఈయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఈ ఒక్క సినిమా ఈయన కెరియర్ కు పునాది వేసింది. ఆ తర్వాత ‘మా బాలాజీ’, ‘చాలా బాగుంది’, ‘చెప్పాలని ఉంది’, ‘అయోధ్య’, ‘ఆదిలక్ష్మి’, ఇలా పలు చిత్రాలు చేసిన ఈయన.. 2016లో వచ్చిన ‘ఎటాక్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక అప్పటినుంచి మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు వడ్డే నవీన్. అలా దాదాపు 9 ఏళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైన ఈయన ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
రీ ఎంట్రీకి సిద్ధమైన వడ్డే నవీన్..
ఇకపోతే తాజాగా బిగ్ టీవీ కి ఎక్స్లూజివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇంకా పేరు కూడా పెట్టని ఒక సినిమాతో వడ్డే నవీన్ విలన్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో ఒక కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అంతేకాదు ఇదే సినిమాతో ఒక కొత్త హీరో కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పుడు ఈ కొత్త డైరెక్టర్.. మరో కొత్త హీరోతో కలిసి సినిమా చేస్తున్న నేపథ్యంలో..ఈ కొత్త సినిమా ద్వారా వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వడ్డే నవీన్ ఈసారి హీరోగా కాకుండా విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు తెలుస్తోంది.
తన బ్యాచ్ నే ఫాలో అవుతున్న.. నవీన్ వర్కౌట్ అవుతుందా..
ఇకపోతే ఒక జనరేషన్ లో తెరపైకి వచ్చిన హీరోలు.. ఆ తర్వాత రీఎంట్రీలో ఎలాంటి పాత్రలైతే చేస్తారో మిగతా హీరోలు కూడా దాదాపు అదే రోల్స్ చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు వడ్డే నవీన్ కూడా అంతే. 2000 సంవత్సరంలో తనతో పాటు నటించిన హీరోలలో శివాజీ (Sivaji) కూడా రీ ఎంట్రీ లో విలన్ గా అడుగుపెట్టాడు. బిగ్ బాస్ (Bigg Boss) నుంచి బయటకు వచ్చిన తర్వాత 90 ‘s వెబ్ సిరీస్ చేసి మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఇటీవల నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీలో విలన్ గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. విలన్ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయారు శివాజీ. ఇక ఈయన కంటే ముందు ఈయన బ్యాచ్ అయిన వేణు తొట్టెంపూడి (Venu Thottempudi) కూడా విలన్ గానే అడుగుపెట్టారు. రవితేజ (Raviteja ) హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ వేణు తొట్టెంపూడికి ఆ విలన్ పాత్ర పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆయన ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు వడ్డే నవీన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అసలే కొత్త కుర్రాడితో మూవీ.. అందులోనూ పరిచయం లేని క్యారెక్టర్..మరి వడ్డే నవీన్ ఏ రేంజ్ లో కం బ్యాక్ అవుతారో చూడాలి.
ALSO READ:Producers Meet : సమావేశంలో గందరగోళం… తలుపులు తన్నుకుంటూ బయటికి వెళ్లిపోయిన స్టార్ ప్రొడ్యూసర్..