Child Trafficking Gang: ఆసుపత్రుల్లో పసి కందులను ఎత్తుకెళ్లి అమ్ముకునే ముఠా గుట్టు రట్టయ్యింది. ఏకంగా ఐదుగురు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి ముగ్గురు పసికందులను కాపాడి వారి తల్లులకు అప్పటించారు. సంచలనం రేపిన ఈ వ్యవహారం విజయవాడలో వెలుగు చూసింది. పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి.
పసి పిల్లల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు మొహరించారు. బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో సైతం దృష్టి పెట్టారు. పసి పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే ఫలానా నెంబర్‌కు ఫోన్ చేయాలని టోల్ ఫ్రీ నెంబర్ సైతం సిటీల్లో కనిపిస్తున్నాయి. దీంతో పిల్లల అక్రమ రవాణా గ్యాంగ్ రూటు మార్చింది. కనిపించే చిన్నారుల కంటే.. పసికందులైతే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించింది. పక్కాగా స్కెచ్ వేసింది ఆ గ్యాంగ్. అడ్డంగా పోలీసులకు చిక్కింది.
అసలేం జరిగింది?
వివిధ రాష్ట్రాల శిశువులను గుట్టుచప్పుడుగా విజయవాడలో విక్రయిస్తున్న మహిళల ముఠా పోలీసులకు చిక్కింది. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ఇద్దరు మగ పిల్లలు, ఓ పాపను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు వెల్లడించారు.
భవానీపురం ప్రాంతానికి చెందిన బలగం సరోజిని సంతానలేమితో బాధపడుతోంది. అయితే విజయలక్ష్మి అనే మహిళ ద్వారా గుడ్లు ఇస్తూ డబ్బులు తీసుకునేది. ఇలాగే మరికొందరితో చేయించి కమీషన్ తీసుకునేది. ఇంతవరకు ఆ గ్యాంగ్ కథ బాగానే నడిచింది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ పసి పిల్లలను విక్రయిస్తే అధికంగా డబ్బులు వస్తాయని ఆమెకు ఆశ చూపించింది.
ALSO READ:ఘోర రోడ్డు ప్రమాదం, రెండు బస్సులు ఢీ.. 37 మంది మృతి
చైన్ మార్కెట్ మాదిరిగా
ఢిల్లీకి చెందిన ప్రీతి కిరణ్, అహ్మదాబాద్‌కు చెందిన అనిల్‌తో రిలేషన్ పెంచుకుంది. వారిద్దరు చిన్నారులను తీసుకువచ్చి సరోజినికి విక్రయించేవారు. డిమాండ్ బట్టి ఆమె లక్ష నుంచి 5 లక్షల వరకు విక్రయించేది. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన శిశువులను ప్రకాశ్‌నగర్‌లో తన బంధువులు కరుణశ్రీ, శిరీషలకు చూసేవారు. శిశువులను అప్పగించడానికి అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన షేక్ ఫరీనా , షేక్ సైదాబీలను నియమించుకుంది.
శిశువుల విక్రయంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రకాశ్‌నగర్‌లో పసిపిల్లల విక్రయంపై ముఠాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు చేశారు. సూత్రధారి సరోజినితో పాటు నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ముగ్గురు చిన్నారులను తీసుకుని శిశు సంరక్షణ అధికారులకు అప్పగించారు.
26 మంది చిన్నారుల విక్రయం
ఈ ముఠా మరో నలుగురు శిశువులను విక్రయించినట్లు గుర్తించారు. వారిని ఎవరికి విక్రయించారనే దానిపై పోలీసులు ఆరా తీశారు. ముగ్గుర్ని ఏలూరులో విక్రయించినట్లు తేలింది. దీంతో మూడు బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ఇక సరోజినిపై తెలంగాణ, మహారాష్ట్రలో కేసులు ఉన్నాయి. గత ఏడాది మే 22న బలగం సరోజినిపై రాచకొండ కమిషనరేట్ పరిధి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో అరెస్టయి ఆమె, బెయిల్‌పై బయటకు వచ్చింది. ముంబైలో ఇలాంటి కేసు ఒకటి ఉంది. అయితే ఈ రెండు కేసులూ పిల్లల్ని విక్రయించినవే. గడిచిన తొమ్మిది నెలల్లో 26 మంది పిల్లలను విక్రయించినట్టు పోలీసుల విచారణలో తేలింది.