Samantha..హీరోయిన్ సమంత (Samantha)కి లైఫ్ లో అన్నీ కష్టాలే అని, ఆమె అభిమానులు అంటూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే విడాకులు తీసుకుందో అప్పటినుండి సమంత జీవితం ఆగమ్యగోచరంగా తయారయ్యింది. ఆమె ఏది చేసినా కూడా దాన్ని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే చేస్తున్నారు. చిన్న పోస్ట్ చేసినా లేదా ఎవరితోనైనా.. కనిపించినా.. ఆమె గురించి అసభ్యకరమైన పోస్టులు చేస్తూ వస్తున్నారు. అయితే అలాంటి సమంత ఓ సినిమా షూటింగ్ సెట్లో ఆ హీరోని చూసి వెక్కివెక్కి ఏడ్చిందట. అయితే షూటింగ్ సెట్లో హీరోని చూసి ఏడవడం అంటే అందరూ తన మనసుకు నచ్చిన హీరోనో లేక నాగచైతన్యనో అనుకుంటారు.కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.
ఆమె నటన మహాద్భుతం.. ఆది పినిశెట్టి..
ఇక అసలు విషయం ఏమిటంటే.. సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటించిన రంగస్థలం (Rangasthalam) సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడి పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా సమంత (Samantha), చరణ్ అన్న పాత్రలో ఆది పినిశెట్టి(Adi Pinishetty), యాంకర్ అనసూయ (Anasuya) కీ రోల్ లో నటించారు. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో నటించిన ఆది పినిశెట్టి ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి నామినేషన్ వేసి చివరికి విలన్ చేతిలో హత్యకు గురవుతాడు. అయితే ఆది పినిశెట్టి చనిపోయిన సమయంలో “ఓరయ్యో నాఅయ్యో” అనే ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది. ఇందులో ఆది పినిశెట్టి శవం దగ్గర ఏడుస్తూ ఒక సీన్ ఉంటుంది. అయితే ఈ సీన్ కోసం హీరోయిన్ సమంత, రోహిణి(Rohini) ఇద్దరు నిజంగా నేను చనిపోయినట్టే ఏడ్చారని, నిజ జీవితంలో తమ మనసుకు నచ్చిన వారు చనిపోతే ఎలా అయితే ఏడుస్తారో అచ్చం అలాగే చేశారు అని తాజాగా ఆది పినిశెట్టి శబ్దం (Shabdam) మూవీ ప్రమోషన్స్ లో చెప్పారు.
సమంతపై ప్రశంశలు కురిపించిన ఆది పినిశెట్టి..
ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను చనిపోయే పాత్రలో “ఒరేయ్యో సాంగ్” వచ్చినప్పుడు రోహిణి , సమంత ఇద్దరు నిజంగానే ఏడ్చేశారు.వాళ్ళ ఏడుపులకు నేను నిజంగా చనిపోతే ఇలాగే ఏడుస్తారు కావచ్చని భయమేసింది. ఇక సమంత అయితే ఏడ్చే సీన్ లో ఒదిగిపోయి నటించింది. రోహిణి కూడా తన భర్త చనిపోయిన ఘటన గుర్తుతెచ్చుకొని ఏడ్చానని చెప్పారు. అలా సమంత, రోహిణి ఇద్దరు ఆ సీన్ లో పరకాయ ప్రవేశం చేసినట్టే నటించారు “అంటూ ఆది పినిశెట్టి చెప్పుకొచ్చారు. ఇక ఓరయ్యో సాంగ్ కి అందులో నటించిన వాళ్లే కాదు.ఈ సినిమా థియేటర్లో చూసిన చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆది పినిశెట్టి తండ్రి కూడా ఈ సినిమాని థియేటర్లో చూసినప్పుడు అది కేవలం ఒక సీన్ అని తెలిసినా.. డైరెక్టర్ అయ్యుండి కూడా ఆ పాత్రలో తన కొడుకుని చూసి కన్నీరు పెట్టకుండా ఉండలేకపోయారట. దీంతో సమంత ఏ లెవెల్లో యాక్టింగ్ చేస్తుందో మరోసారి ప్రూవ్ అయింది అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.