Constable Cheats Girl: ప్రభుత్వం ఉద్యోగి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సోషల్ రెస్పాన్సిబిలిటీ. ముఖ్యంగా పోలీసులు ఉద్యోగులకు సమాజంలో జరిగే పరిస్థితులతో ఎక్కువ సంబంధం ఉంటుంది. అయితే సమాజంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ యువతిని మోసం చేసిన ఘటన ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది.
మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో విషాదం చోటుచేసుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని చెప్పిన ప్రియుడు పెళ్ళికి నో చెప్పడంతో ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి సక్కుబాయ్(21) ఆత్మహత్య చేసుకుంది.
ప్రేమ పేరుతో మోసం..
పూర్తి వివరాల్లోకి వెళితే..అయితే సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సిద్దుతో కొద్ది రోజుల క్రితం పరిచయం ఏర్పడింది.వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది.దీంతో సక్కుబాయ్ పెళ్లిచేసుకుందాం అని సిద్దును అడిగింది. అయితే పెళ్లికి సిద్దు నిరాకరించడంతో తీవ్రంగా ఆ యువతి మనస్థాపనికి గురైంది. 3 రోజుల క్రితం ఆ యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. యువతి మృతితో గ్రామంలో అంతా విషాదా ఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: మోదీ మైండ్ గేమ్.. ట్రంప్ చాప్టర్ క్లోజ్! ఇండియా లేకపోతే అమెరికా పరిస్థితి ఇదే..