Rohit Sharma MI batting order Demote| టీమిండియా కోసం కెప్టెన్ గా ప్రపంచ కప్ లు సాధించిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం బ్యాటింగ్ ఫామ్ కోల్పోయి ఐపిఎల్ తో తడబడుతున్నాడు. రోహిత్ శర్మ్ ఫామ్ లో లేడని దీని వల్ల ముంబై ఇండియన్స్ టీమ్ ఐపిఎల్ తన పూర్తి స్థాయిలో నిరూపించుకోలేకపోతోందని మహిళ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అభిప్రాయపడింది. రోహిత్ ఫామ్ లేమి కారణంగా ఐపిఎల్ ప్రారంభం తరువాత జరిగిన మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ టీమ్ అతడిని ఇంపాక్ట్ సబ్ ప్లేయర్ (అదనపు ప్లేయర్) గా కాస్త పక్కన బెట్టింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో అతను చాలా తక్కువ స్కోర్ లు నమోదు చేశాడు. ఆడిన అయిదు మ్యాచ్ లలో రోహిత్ చేసిన స్కోర్లు 0,8, 13, 17, 18 మాత్రమే. ఈ ఫిగర్లు చూస్తే అర్థమవుతోంది రోహిత్ బ్యాటింగ్ చేయడంతో తడబడుతున్నాడని.
ముంబై ఇండియన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.ఆడిన 6 మ్యాచ్ లలో నాలుగింటిలో ఓడిపోయింది. రెండు మాత్రమే గెలుచుకుంది. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్ టీమ్ కేవలం 12 రన్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ కూడా చివరి దాకా థ్రిల్లింగ్ గా సాగింది.
అందుకే దీని గురించి మహిళ క్రికెటర్ అంజుమ్ చోప్రా మాట్లాడుతూ.. “రోహిత్ ఫామ్ లో లేడు. అదేం వింత కాదు. కానీ దాని వల్ల ముంబై ఇండియన్స్ కు బ్యాటింగ్ చేసే సమయంలో మంచి ప్రారంభం లభించడం లేదు. రోహిత్ కు ఉన్న పాపులారిటీ వల్ల అతడిని టాప్ ఆర్డర్ లో కొనసాగిస్తున్నారు. కానీ దాని వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు లభించడం లేదు. అందుకే అతడిని బ్యాటింగ్ ఆర్డర్ లో డిమోట్ చేస్తే ఉపయోగపడవచ్చు. అతను పూర్తిగా ఆడడం లేదని నేను చెప్పడం లేదు. కానీ టీమ్ కు ఇంకా ఇతర ఆప్షన్స్ ఉన్నాయిగా. ఆ ఆప్షన్స్ ని వినియోగించుకోవాలి.
Also Read: కరుణ్ నాయర్ పై బుమ్రా కుట్రలు.. రోహిత్ రియాక్షన్ అదుర్స్