E-Paper
Advertisement

పాలేరు నీలమ్మ ఇంటిపై కలెక్టర్ సీరియస్.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..!

పాలేరు నీలమ్మ ఇంటిపై కలెక్టర్ సీరియస్.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..!
Advertisement

Indiramma Housing: స్వేచ్ఛ బ్యూరో: పాలేరులో నీలమ్మ అనే లబ్ధిదారుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమగ్ర విచారణ నిర్వహించారు. ఆరోపణలు నిరాధారమని తేల్చారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని హౌసింగ్ పీడీ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలేరు గ్రామ పంచాయతీ పరిధిలో ఏప్రిల్ 29న నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారు నీలమ్మ మాట్లాడిన అంశంపై వివిధ ప్రచార మాధ్యమాలలో వస్తున్న ప్రచారాలపై లబ్ధిదారుని అర్హతపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర విచారణ జరిపారు.

పిల్లి నీలమ్మ ఇంటిని..

బీపీఎల్ కుటుంబానికే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గృహం మంజూరు చేసినట్లు, అసత్య ప్రచారాలను నమ్మవద్దనీ విజ్ఞప్తి చేశారు. కూసుమంచి మండల అభివృద్ధి అధికారి టి. జశ్వంత్ కుమార్ పంచాయతీ కార్యదర్శి, హౌసింగ్ ఏఈలతో కలిసి సంబంధిత లబ్ధిదారు పిల్లి నీలమ్మ ఇంటిని ప్రత్యక్షంగా సందర్శించి అర్హతలను పరిశీలించి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. విచారణ సందర్భంగా లబ్ధిదారు పిల్లి నీలమ్మ మాట్లాడుతూ తాను మొదటిసారి వేదికపై మాట్లాడడంతో పొరపాటు పడ్డానని తెలిపారు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన తర్వాతే తమ కుమారుడు లండన్‌కు వెళ్లాడని, కుమారుడిని విదేశాలకు పంపేందుకు రుణం, తమ అత్త మామలకు సంబంధించిన సుమారు 1.25 గుంటల భూమిని అమ్మి బంధువులు డబ్బులు సమకూర్చారని వివరించారు.

అసత్య ప్రచారాలు..

Advertisement

తనకుమార్తె ఇంజినీరింగ్ (ఈఇఈ) పూర్తి చేసి ప్రైవేట్ రంగంలో పని చేస్తోందని, ప్రభుత్వ ఉద్యోగంలో లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించిందని, కొన్నిసార్లు ఆహారం కూడా లేక ఇబ్బందులు పడ్డామని, భర్త మత్స్యకారుడిగా పనిచేస్తుండగా తాను కూలి పనులు చేసి పిల్లలను చదివించామని, ఎవరినీ మోసం చేయలేదని, దయచేసి తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని ఆమె కోరారు. ఈ విషయంపై అసత్య ప్రచారాలను నమ్మవద్దని హౌసింగ్ పీడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

Also read: డొమెస్టిక్ కంటే కమర్షియల్ ధరల పెంపు ప్రమాదకరం: ఎంపీ మల్లు రవి

కుమార్తె ఇంజినీరింగ్..

Advertisement

విచారణలో లబ్ధిదారు కుటుంబం బీపీఎల్ వర్గానికి చెందినదిగా నిర్ధారించబడింద ని, వారి కుటుంబానికి ప్రస్తుతం ఎటువంటి భూమి యాజమాన్యం లేదని తేలిందన్నారు. ఫీల్డ్ విజిట్ సమయంలో గమనించిన నివాస గృహం గతంలో పాడు బడిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. గతంలో జీవనోపాధి అవసరాల కోసం కొంత భూమిని విక్రయించినట్లు, అలాగే ఒక సంతానాన్ని విదేశాలకు పంపేందుకు కొంత మొత్తం రుణం తీసుకున్నట్లు విచారణలో వెల్లడైందనీ, కుటుంబంలోని కుమార్తె ఇంజినీరింగ్ (ఈఇఈ) పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగంలో లేరనీ తెలిపారు.

గృహ మంజూరు..

అంశాలన్నింటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం, గృహ మంజూరు పూర్తిగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే జరిగిందని, అర్హత లేని వారికి ఇళ్లు మంజూరు చేశారనే ఆరోపణలు అసత్యమని హౌసింగ్ పీడీ స్పష్టం చేశారు. ఆ కుటుంబం లోని కుమారుడు ఉన్నత విద్య కోసం లండన్‌కు వెళ్లిన సందర్భంలో, మొత్తం 16,560 పౌండ్ల ట్యూషన్ ఫీజులో 16,000 పౌండ్లు యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫోర్డ్ మాంచెస్టర్ నుండి గ్లోబల్ గోల్డ్ ఎక్స్లెన్స్ స్కాలర్‌షిప్ రూపంలో లభించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇది విద్యార్థి ప్రతిభను ప్రతిబింబించే అంశమని హౌసింగ్ పీడీ పేర్కొన్నారు.

Also read: తహసిల్ధార్లకే షాక్.. అయిజలో‌ నకిలీ ధ్రువపత్రాల గుట్టు రట్టు..!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×