Sai Dharam Tej : తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హెల్ప్ కావాలని కోరుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయనే మెగా కాంపౌండ్ లో ఒక స్టార్ హీరో. అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో సహాయం చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ సహాయం తన కోసం కాదు, ఓ పాప కోసమట.
సాయి ధరమ్ తేజ్ పోస్ట్…
తాజాగా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) అనారోగ్యంతో ఉన్న ఓ పాప ప్రాణాలను కాపాడుదాం అంటూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశారు. అందులో “మనమందరం చేతులు కలిపి ఈ చిన్నారి జీవితంలో వెలుగులు నింపుతాం. దయచేసి ఆ చిన్నారి అనారోగ్యం నుంచి కోలుకోవడానికి హెల్ప్ చేయండి. ఆమె అందమైన చిరునవ్వు మరింత అందంగా అయ్యేలా చేద్దాం. ఇప్పటి వరకు హెల్ప్ చేసిన దాతలు అందరికీ, మీ సహకారానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దీనికి మీరు ఎంత డబ్బు ఇస్తున్నారు అనేది ముఖ్యం కాదు. మనస్ఫూర్తిగా దాతలుగా మారిన వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అంటూ పోస్ట్ చేశారు.
అంతకంటే ముందు సాయి ధరం తేజ్ (Sai Dharam Tej) పాప అనారోగ్యంతో ఉందన్న పోస్ట్ ని షేర్ చేసుకున్నారు. ఆ పోస్టులో పాప పేరు ఇక్ర హయా అని వెల్లడించారు. లివర్ వ్యాధితో బాధపడుతున్న ఈ పాప హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఉన్న అపోలో హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుందని వెల్లడించారు. అయితే ఆ పాప ట్రీట్మెంట్ కు భారీగా ఖర్చు అవుతుందని, తనవంతుగా ఆ పాప ప్రాణాలు కాపాడడానికి విరాళం ఇచ్చానని ఈ పోస్టులో వెల్లడించారు సాయి ధరం తేజ్. అలాగే “మీ వంతు విరాళాలు ఇచ్చి పాపను కాపాడండి. ప్రతి విరాళం విలువైనదే. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పాప ఒక పోరాట యోధురాలు. మీ సపోర్టుతో ఆమె ఈ వ్యాధిని అధిగమిస్తుంది” అంటూ విరాళాలు ఇవ్వాల్సిన లింక్, ఆ పాపకు సంబంధించిన డీటెయిల్స్ ని ఆయన తన పోస్టులో షేర్ చేశారు.
Let us join our hands and be a part of this little one’s life…Please help the little one get better and let her adorable smile grow wider… to all the donors so far please take my heartfelt gratitude 🙏🏼 for your contribution, it’s not the matter of money or the amount it’s the… https://t.co/StsGjiPiMB
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 7, 2025
ఇటీవల కాలంలో సాయి ధరం తేజ్ సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా ఉంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఎవరైనా చిన్న పిల్లలపై దారుణమైన కామెంట్స్ చేస్తే, అదే సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి తోలు వలిచేస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన ఓ చిన్నారి పాప అనారోగ్యం నుంచి కోలుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
‘సంబరాల ఏటిగట్టు’తో పాన్ ఇండియా ఎంట్రీ
ఇక మరోవైపు సాయి దుర్గ తేజ ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించగా, ‘జార్జ్ రెడ్డి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రోహిత్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. 2025 సెప్టెంబర్ 25న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది.