Drone Cameras: నేరాలు అరికట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఏపీ పోలీసులు. విషయం తెలిసి సంబంధిత ప్రాంతానికి వెళ్లే సరికి ఆయా వ్యక్తులు ఎస్కేప్ అయిపోతున్నారు. ఇప్పుడు టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట వేస్తోంది. ఆకాశంలో డ్రోన్ కెమెరాల సౌండ్ వినిపిస్తే చాలు కొందరు వ్యక్తులు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. కనీసం రెండు వారాలకొకటి అలాంటి ఘటనలు ఏపీలో జరుగుతున్నాయి.
ఏపీని డ్రోన్లకు హబ్‌గా మార్చాలని ప్రయత్నాలు చేస్తోంది కూటమి సర్కార్. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నేరుగా చేసి చూపిస్తోంది. దీనివల్ల సహాయ కార్యక్రమాలు మాత్రమేకాదు.. నేరాలు సైతం అడ్డుకట్ట వేసేందుకు అడుగులు వేస్తోంది. మంచి ఫలితాలు వస్తున్నాయి కూడా. ఆ మధ్య బెజవాడ వరదల్లో డ్రోన్‌తో బాధితులను ఆహారం అందజేసింది ప్రభుత్వం. దానికి దేశవ్యాప్తంగా మాంచి స్పందన వచ్చింది.
ఇప్పుడు డ్రోన్ వినియోగించి నేరాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ పోలీసులు. వీటిని చాలాచోట్ల ప్రయోగించారు. మంచి ఫలితాలు వచ్చాయి. అదెలా అనుకుంటారా? అక్కడికే వచ్చేద్దాం. కింద కినిపిస్తున్న వీడియోలో సన్నివేశమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోలీసులు నిఘాను కఠినతరం చేశారు. జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. గుడివాడ నియోజకవర్గం పరిధిలో ఓ ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక బహిరంగ ప్రదేశానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. రోడ్డుపై టూ వీలర్ ఆపి, కూతవేటు దూరంలోకి వెళ్లి పెద్ద రాయిపై కూర్చుని కులాసగా కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంత వాతావరణంలో మద్యం సేవిస్తున్నారు.
ALSO READ: భార్య కడుపుతో ఉన్నా కనికరించని భర్త, నడిరోడ్డుపై దాడి
ఈలోగా రీసౌండ్ పెడుతూ డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. ఇలాంటివి చెప్పడం కంటే చూడడమే బెటర్. ఆ ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించడం ఏమోగానీ డ్రోన్ కెమెరాలను చూసి పరుగో పరుగు. చివరకు తాగినదంతా దిగిపోయింది. అంతదూరం వచ్చి మద్యం పుచ్చుకుంటున్నారంటే బహుశా పేరెంట్స్ తెలియకుండా ఆ వ్యక్తులు చేస్తున్న సీక్రెట్ వ్యాపకాల్లో ఇదీ కూడా ఒకటి.
చివరకు డ్రోన్ కెమెరాల ఆధారంగా సమీపంలోని పోలీసులకు సమాచారం ఇవ్వడం వారిని అరెస్ట్ చేయడం, ఆపై కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయింది. ఆ తరహా ఘటనలు ఏపీలో వారానికి ఒకటి లేదా రెండు వారాలకు ఒకటైన బయటకు వస్తుంది. సీక్రెట్‌గా ఈ విధంగా చేయడం తప్పుకాదు.. కానీ, తాగి అల్లర్లు చేస్తే సమాజానికి ఇబ్బంది.
రెండురోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లాలో అలాంటి ఘటన జరిగింది. ఉభయగోదావరి జిల్లాల గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ ఓ సెక్షనాఫ్ వర్గం వీలైతే కోడి పందాలు లేదంటే పేకాట ఆడడం తరచూ చూస్తుంటాము. నిర్మానుష్య ప్రదేశాల్లో పేకాట ఆడుతున్నవారికి డ్రోన్ కెమెరాలతో చెక్ పెట్టారు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు.
ఉండి పట్టణ శివారులో పంట పొలాల్లో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని గుర్తించారు. డ్రోన్ కెమెరాలను చూసి వారంతా పరారయ్యారు. చివరకు వారిని గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు డ్రోన్ నిఘా ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని చెబుతున్నారు. అంతకుముందు కర్నూలు, అనంతపురం ఈ తరహా ఘటనలు జరిగిన విషయం తెల్సిందే.
జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్న కృష్ణా జిల్లా పోలీస్. గుడివాడ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్నారని గుర్తించి, మద్యం సేవిస్తున్న ఇద్దరిని అదుపులోనికి తీసుకొని, వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. pic.twitter.com/qVfgVG8VMi
— Krishna District Police (@sp_kri) April 6, 2025