Kerala Viral Video: ఉద్యోగులను ఎంత బాగా చూసుకుంటే సంస్థ.. అంత చక్కగా రాణిస్తుంది. ఉద్యోగులను సొంత మనుషుల మాదిరిగా చూసుకుంటేనే మంచి లాభాలు వస్తాయి. కాదని, కఠినంగా వ్యవహరిస్తే, కంపెనీ మూతపడటం ఖాయం. తాజాగా కేరళలోని ఓ కంపెనీ ఉద్యోగుల పట్ల వ్యవమరించిన తీరు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇచ్చిన టార్గెట్ ను కంప్లీట్ చేయని ఉద్యోగుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించింది. మెడకు గొలుసు కట్టి, నేల మీద మోకాళ్ల మీద నడిపిస్తూ అమానుషంగా ప్రవర్తించింది. నేల మీద కాయిన్స్ ఉంచి, నాలుకతో తీయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో కేరళ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
కేరళలోని కలూరు ప్రాంతంలో ఉన్న హిందూస్తాన్ పవర్ లింక్స్ ప్రైవేటు మార్కెటింగ్ సంస్థకు చెందిన కెల్ట్రోలో ఈ ఘటన జరిగింది. ఈ కంపెనీకి చెందిన పెరుంబవూర్ బ్రాంచీలోని ఉద్యోగులను వేధించారు. ఇచ్చిన టార్గెట్లను ఫిషిష్ చేయని కారణంగానే ఈ ఇలా పనిష్మెంట్ ఇచ్చినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
Modern Slavery, Shocking and inhumane treatment of employees have come to light in Hindustan Powerlinks Company located in Kochi, Kerala. Employees who did not meet the target were given harsh punishments, such as being forced to walk like a dog with a belt tied around their… pic.twitter.com/oIqpnNOItx
— Pinky Rajpurohit 🇮🇳 (@Madrassan_Pinky) April 6, 2025
ఆరోపణలను ఖండించిన మేనేజ్‌మెంట్
అటు తమ కంపెనీ మీద వస్తున్న ఆరోపణలను హిందూస్తాన్ పవర్ లింక్స్ యాజమాన్యం ఖండించింది. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని వెల్లడించింది. కొంత మంది కావాలని తమ కంపెనీ మీద దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది. తమ కంపెనీ అన్ని చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి ఉంటుందని వెల్లడించింది. కెల్ట్రో అనేది.. హిందూస్తాన్ పవర్ లింక్స్ కు ఏజెంట్ గా మాత్రమే పని చేస్తుందని తెలిపింది. ఈ ఘటనకు తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన కేరళ ప్రభుత్వం
అటు ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మీడియాలో ప్రసారం అయిన విజువల్స్ తనను షాక్ కు గురి చేశాయని ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వీ శివన్‌కుట్టి వెల్లడించారు. కేరళలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విచారణ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి వేధింపులన సహించబోమని శివన్ కుట్టి వెల్లడించారు.
విచారణ మొదలు పెట్టిన పోలీసులు
అటు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. తొలుత ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చిన వారిని ప్రశ్నించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగులను హింసించారనే ఆరోపణలపై హైకోర్టు న్యాయవాది కులత్తూర్ జైసింగ్ దాఖలు చేసిన ఫిర్యాదుతో.. కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. కేరళ రాష్ట్ర యువజన కమిషన్ కూడా ఈ విషయంపై స్వయంగా చర్య తీసుకుని ప్రత్యేక కేసు నమోదు చేసింది. జిల్లా పోలీసు చీఫ్‌ను వివరణాత్మక నివేదికను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. నాగరిక, ప్రజాస్వామ్య సమాజంలో అమానవీయ ఘటనలను సహించకూడదని కమిషన్ అభిప్రాయపడింది.
Read Also: పచ్చళ్ళ బిజినెస్ క్లోజ్.. అలేఖ్య చిట్టి కొత్త వ్యాపారం ఇదే!