Hyderabad: గచ్చిబౌలిలో అమానవీయ ఘటన.. కడుపుతో ఉన్న భార్యను నడిరోడ్డుపై సిమెంట్ ఇటుకతో విచక్షణారహితంగా దాడి చేసిన భర్త. తీవ్రగాయాలపాలైన ఆమె ప్రస్తుతం ప్రాణపాయస్థితిలో చికిత్స పొందుతుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హఫీజ్ పేట ఆదిత్యనగర్‌లో ఉంటున్న మహ్మద్ బసరత్(32) ఇంటీరియర్ పనులు చేస్తుంటాడు.
2023లో అజ్ మేర్ దర్గాకు వెళ్లాడు. బస్సు ప్రయాణంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన షబాన పర్వీన్‌తో(22) పరిచయం ఏర్పడింది. అది కాస్తే ప్రేమగా మారింది. 2024అక్టోబర్‌లో కోల్‌కతాకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుని హఫీజ్ పేటకు తీసుకువచ్చాడు. వేరు కాపురం పెడదామన్న పర్వీన్ ఒత్తిడితో బసరత్ తల్లిదండ్రులను కాదని అదే బస్తీలో అద్దె తీసుకుని ఉంటున్నాడు.
ఆ తర్వాత భర్యభర్తల మధ్య విభేదాలు మెుదలై తరచూ గొడవపడుతున్నారు. ఇటీవల పర్వీన్ గర్భం దాల్చింది. ప్రెగ్నెన్సీ వచ్చి రెండు నెలలు కావడంతో ఆమెకు వాంతులు అధికమయ్యాయి. అప్పుడు తన భర్త మార్చి 29న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఏప్రిల్ 1న రాత్రి 10 గంటల సమయంలో భార్యను డిశ్ఛార్జి చేయించుకొని తన భర్త బయటకొచ్చాడు.. బయటికొచ్చిన తర్వాత మళ్లీ మహ్మద్ బసరత్ తన భర్యాతో గొడవపడ్డాడు.
Also Read: లెక్చరర్‌ని ముంచేసిన ఫేక్ బాబా.. దిష్టి పేరుతో 20 లక్షలకు టోకరా
మరికొంతసేపటి తర్వాత మహ్మద్ బసరత్ రెచ్చిపోయి ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై ఆమెను కింద పడేసి ఇష్టానుసారంగా దాడి చేశాడు. దాడి చేసే సమయంలె పక్కనే సిమెంట్ ఇటుకలు కనిపించడంతో అందులో ఒకటి తీసుకోని ఆమె తలపై పలుమార్లు బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందనుకొని పారిపోయాడు. అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఆమెను నిమ్స్ కు తరలించారు. తలకు బలమైన గాయం అవ్వడంతో కోమాలోకి వెళ్లిన షబాన పర్వీన్ ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి 3న రిమాండ్‌కు తరలించారు. ఇంత దారుణానికి పాల్పడిన మహ్మద్ బసరత్‌కు కఠిన శిక్ష పడాలని షబాన పర్వీన్‌కి న్యాయం జరగాలని స్థానికులు కోరారు.