Big Stories

Elderly Couple Died: తీవ్ర విషాదం.. వృద్ధ దంపతులు మృతి!

Elderly Couple Died in Road Accident: ఆ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధ దంపతులు కారులో ప్రయాణిస్తున్నారు. అనుకోని ప్రమాదం ఎదురై ఇద్దరు వృద్ధ దంపతులు మృతిచెందారు. మరో ఇద్దరు యువకులకు కూడా తీవ్ర గాయలయ్యాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు వెంటనే అక్కడికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. జిల్లాకు చెందిన మామిళ్లగూడెంకు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో బోనకల్ వండలం ముష్టికుంట్ల వద్దకు రాగానే ఆ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతిచెందినట్లుగా తెలుస్తోంది. మరో ఇద్దరు యువకులు కూడా తీవ్రంగా గాయపడగా, ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు వెంటనే అక్కడికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇదిలా ఉంటే మంగళవారం అర్ధరాత్రి ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సొంత ఊరులో ఓటు వేసి తిరిగి మళ్లీ హైదరాబాద్ కు ప్రైవేట్ బస్సులో వస్తున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట సమీపంలోకి రాగానే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ బస్సును టిప్పర్ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ క్రమంలో టిప్పర్ కు మంటలు వ్యాపించాయి. ఆ మంటలు బస్సుకు అంటుకుని, బస్సులో కూడా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న ప్రయాణికుల్లో నలుగురు, డ్రైవర్ మంటల్లో చిక్కి మృతిచెందారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోగా బస్సులోని ఐదుగురు సజీవన దహనమయ్యారు. ఈ ఘటనలో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే.

Also Read: సంజయ్ కామెంట్స్, ఫలితాల తర్వాత కేసీఆర్…

అదేవిధంగా మరో ఘటన కూడా చోటు చేసుకుని ఏపీలో ఐదుగురు మృతిచెందారు. నలుగురికి గాయాలయ్యాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో రహదారి పక్కన ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలను కూలీలు ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. దీంతో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News