Karnataka Incident: కర్ణాటకలో వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆనందోత్సవాల మధ్య జరుగుతున్న గణేష్ నిమజ్జనం ఊరేగింపు పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. హసన్ జిల్లాలోని మొసలె హోసహళ్లి రైల్వే గేట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
9 మంది మృతి.. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలు
అయితే నిన్న రాత్రి గణేష్ నిమజ్జనం శోభాయాత్ర నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు పోలీసులు. అరకలగుడు నుంచి వస్తున్న ట్రక్కు.. అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని జనాలపైకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడినవారిని అక్కడి సమీపంలోని హసన్ ఆస్పత్రికి తరలించారు.
డ్రైవర్ ట్రక్కుపై కంట్రోల్ కోల్పోవడంతో ప్రమాదం..
పోలీసుల వివరాల ప్రకారం ఈ ఘటనకు కారణం అతివేగం, నిర్లక్ష్యంగా వచ్చిన ఓ సరకు లారీ అదుపుతప్పి ముందుగా బైక్ ను ఢీకొట్టింది. ఆ తర్వాత డివైడర్‌ను ఢీకొని జనసమూహంపైకి దూసుకెళ్లింది. దీంతో నిమజ్జన వేడుక మొత్తం ఆర్తనాదాలతో నిండిపోయింది. అయితే ఢీకొట్టిన లారీ డ్రైవర్ భువనేశ్‌కు ఏలాంటి ప్రమాదం జరుగలేదు.. దీంతో అక్కడి ప్రజలు అతన్ని చిదకబాదారు.. ఇప్పుడు అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also Read: జూబ్లీహిల్స్‌తో పాటు.. ఆ పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు?
ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం సిద్దరామయ్య
ఈ ఘటన పట్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
గణేష్ నిమజ్జనం ఊరేగింపులో అపశృతి.. 8 మంది మృతి!
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
హసన్‌లో గణేష్ నిమజ్జనం ఊరేగింపులో భక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్
ఎనిమిది మంది మృతి.. 17 మందికి గాయాలు..
ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం సిద్ధరామయ్య pic.twitter.com/4V0FlcPe34
— BIG TV Breaking News (@bigtvtelugu) September 13, 2025