Ind vs Eng 2nd Odi: భారత్ – ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఒరిస్సాలోని కటక్ వేదికగా జరుగుతున్న రెండవ వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు రాణించారు. దీంతో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు భారత జట్టు బరిలోకి దిగింది.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థానే తోపు.. టీమిండియాకు చెత్త రికార్డులు.. ?
కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. సాకీబ్ మహమ్మద్ వేసిన తొలి ఓవర్ లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. అనంతరం అట్కిన్సన్ వేసిన రెండవ ఓవర్ లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు కెప్టెన్ రోహిత్ శర్మ. గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో మంచి టచ్ లో కనిపించాడు. ఇక ఇదే ఓవర్ లో గిల్ కూడా ఓ ఫోర్ బాదాడు. అలా ఓపెనర్లు దూకుడు ప్రదర్శించారు.
కానీ గేమ్ మంచి ఊపులో ఉండగా ఫ్లడ్ లైట్ కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ అసహనం వ్యక్తం చేశారు. స్టేడియంలో ఒక ఫ్లడ్ లైట్ సాంకేతిక సమస్య వల్ల వెలగడం లేదు. దీంతో ఎంపైర్లు మ్యాచ్ ని నిలిపివేశారు. ఇక ఆటగాళ్లు మైదానాన్ని విడాల్సి వచ్చింది. కాగా ప్రేక్షకులు సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేసి సందడి చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ ఇరుజట్లకు చాలా కీలకం. సిరీస్ గెలవాలనే ఉద్దేశంతో భారత జట్టు ఈ మ్యాచ్ లోకి దిగగా.. ఇంగ్లాండ్ జట్టు సిరీస్ ని డ్రా చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు భారత్ – ఇంగ్లాండ్ మధ్య 108 వన్డే మ్యాచ్ లు జరగగా.. వీటిలో భారత జట్టు 59 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు 44 మ్యాచ్ లలో విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్లలో ఫలితం రాలేదు. కాగా ఈ రెండవ వన్డేలో స్పిన్ మాంత్రికుడు వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు.
అలాగే మొదటి మ్యాచ్ కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ.. జట్టులోకి తిరిగి వచ్చాడు. గత మ్యాచ్ తో వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్.. కోహ్లీ కోసం తన స్థానాన్ని త్యాగం చేశాడు. ఇంగ్లాండ్ జట్టు కూడా ఈ మ్యాచ్ కోసం మూడు మార్పులు చేసింది. మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్, జేమి ఓవర్టన్ లు తుది జట్టులోకి వచ్చారు.
Also Read: Nitish Kumar Reddy: తండ్రికి నితీశ్ కుమార్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్
కాగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో జో రూట్ మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 72 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఇందులో 64 ఉన్నాయి. ఇక ఓపెనర్ బెన్ డకేట్ కూడా ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ తో రాణించాడు. 56 బంతులలో 65 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు ఉన్నాయి. ఇక భారత బౌలింగ్ లో రవీంద్ర జడేజా 35 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అలాగే హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు.
The floodlight tower has gone off for the third time 🏟️🤯
Rohit Sharma is unhappy with the break as India was in good touch 👀😢#INDvENG #ODIs #RohitSharma #Sportskeeda pic.twitter.com/PDLaTHOx7V
— Sportskeeda (@Sportskeeda) February 9, 2025