Cricketers: కొద్ది రోజులలో మరో క్రికెట్ ఏడాది ముగుస్తుంది. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కి కొందరు పూర్తిగా వీడ్కోలు పలకగా.. మరికొందరు పొట్టి క్రికెట్ కి గుడ్ బై చెప్పేశారు. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు సృష్టించిన భారత ఆటగాళ్లు వీడ్కోలు పలకడం అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ 2024లో మొత్తం 27 మంది అంతర్జాతీయ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజ వంటి కీలక ఆటగాళ్లు టీ-20 ఫార్మాట్ నుంచి వైదొలిగారు. తాజాగా టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. అయితే అశ్విన్ తన ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే క్రికెట్ కి వీడ్కోలు పలకడం అభిమానులను నిరాశకు గురిచేసింది. అశ్విన్ ఒక్కడే కాదు ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే తమ కెరీర్ కి వీడ్కోలు పలికిన భారత ఆటగాళ్లు చాలామంది ఉన్నారు.
Also Read: Rohit sharma injury: భారత్ కు భారీ షాక్..!
* భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కి తన ఫేర్వెల్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. వీడ్కోలు మ్యాచ్ ఆడాలని చాలా సందర్భాలలో ఆయన చెప్పినప్పటికీ.. బోర్డ్ అతనికి ఆ మ్యాచ్ ఆడే అవకాశాన్ని ఇవ్వలేదు. దీంతో 2017 అక్టోబర్ 20న అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
* హర్భజన్ సింగ్ కూడా ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. తన కెరీర్ లో 103 టెస్టులు, 236 వన్డేలు, 28 t-20 మ్యాచ్ లు ఆడిన బజ్జీ.. టెస్టుల్లో 417 వికెట్లు, వన్డేల్లో 269, టి20 లో 25 వికెట్లు పడగొట్టి.. ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఐదేళ్లకు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.
* భారత వెటరన్ బ్యాట్స్మెన్ వి.వి ఎస్ లక్ష్మణ్ కి కూడా వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం దొరకలేదు. 2018 ఆగస్టు 18న హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో లక్ష్మణ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.
* మహేంద్ర సింగ్ ధోనికి కూడా వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. ధోని 2014లో టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం ఆరు సంవత్సరాల తర్వాత ఆగస్టు 15వ తేదీన వన్డే, టి20 క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
* ఇక యువరాజ్ సింగ్ కూడా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన 3 ఏళ్ళకు రిటైర్మెంట్ తీసుకున్నాడు. యూవి 2007 t-20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఇతనికి కూడా వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు.
* ఇక ఈ జాబితాలో రాహుల్ ద్రావిడ్ పేరు కూడా ఉంది. క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ద్రవిడ్ కి వీడుకోలు మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. 2012లో ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తరువాత ద్రావిడ్ హఠాత్తుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రిటైర్మెంట్ ప్రకటించాడు.
* ఈ లిస్టులో జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్ వంటి కీలక ఆటగాళ్లకు వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు.
Also Read: Notice to Virat Kohli: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్… ఆ పబ్‌కు నోటీసులు.?