trinayani serial today Episode: వల్లభ అదో రకంగా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు అని సుమన అడుగుతుంది. చూడటం కాదు చూపిస్తున్నాను విలనిజం అంటాడు వల్లభ. పిచ్చి పట్టింది అనడం నిజం అంటుంది హాసిని దీంతో మీకు పిచ్చి పట్టింది అంటూ వల్లభ పెద్దమరదలులా ఉన్న అమ్మాయి మీ తొడి కోడలే అన్నట్లు మన ఇంటి రహాస్యాలు అన్ని చెప్పేస్తున్నారు అంటాడు. మీరింకా నమ్మలేదా..? అని సుమన అడుగుతుంది. వీళ్లను ఎవరు నమ్ముతారు అంటుంది హాసిని.
నన్ను మమ్మీని నమ్మించాలంటే ఫ్రూప్స్ కావాలి అంటాడు వల్లభ. ముంచేయడానికి వచ్చిన మారువేషపు మగువను పోలీసులకు పట్టిస్తుంది మమ్మీ. అందుకోసం అఖండ స్వామిని తీసుకురావడానికి వెళ్లింది మమ్మీ అని వల్లభ చెప్పగానే అమ్మ అఖండ స్వామిని తీసుకురాబోతుందని నయని వదినకు తెలుసా? అని విక్రాంత్ అడుగుతాడు. తెలియదు అని చెప్తాడు. ఇంతలో కారు సౌండ్ విని అందరూ బయటకు వెళ్తారు.
విశాల్ వర్క్ చేసుకుంటుంటే.. నేత్రి ఫైల్ తీసుకుని వచ్చి బాబాగారు ఇవేనా మీరు అడిగిన ఫైల్స్ అని ఇస్తుంది. అవునని విశాల్ తీసుకోగానే మీకు చెప్పే అలవాటు లేదా..? అని అడుగుతుంది నేత్రి. ఏంటని విశాల్ అడుగుతాడు. థాంక్స్ అని నేత్రి అంటుంది. చెప్పను ఇస్తాను అంటూ షేక్‌హ్యాండ్ ఇస్తాడు. నేత్రి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో తిలొత్తమ్మ వస్తూ బాగుంది అంటుంది. ఇంతలో హాసిని అక్కడకు వచ్చి వీళ్ల శ్రేయోభిలాషిని తీసుకొచ్చారు అని చెప్తుంది. ఇంకెవరు వస్తున్నారు అని విశాల్ అడగ్గానే తిలొత్తమ్మ రండి అఖండస్వామి అని పిలుస్తుంది.
స్వామి వస్తాడు. ఆయనెవరో వస్తే మీరు నా వైపు చూస్తున్నారేంటి అని నేత్రి అడగ్గానే నీ సంగతి చూడ్డానికి వచ్చారు నయని అంటుంది తిలొత్తమ్మ. నయని కాదు తిలొత్తమ్మ అంటాడు స్వామి. ఇంతలో విశాల్ అమ్మా మళ్లీ ఏంటిది అని అడుగుతాడు. వదిననను పరీక్షించడానికి వచ్చారంట బ్రో అని విశాల్ చెప్పగానే నన్నేనా నన్ను పరీక్షించడానికి నాకు ఏమైంది అని అడుగుతుంది నేత్రి. ఇంతలో నీ పక్కన ఉండాల్సిన వ్యక్తి మారిపోయింది విశాల్ అని తిలొత్తమ్మ చెప్తుంది. అయితే తను మా అక్క కాదా..? కొత్త అక్క అని నిరూపించడానికి అత్తయ్య ఈ స్వాముల వారిని తీసుకోచ్చారా..? అని సుమన అడుగుతుంది.
విక్రాంత్ మాత్రం తిలొత్తమ్మను ఇంకెన్ని సార్లు కన్పీజ్ అవుతారమ్మా అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో తిలొత్తమ్మ ఈసారి క్లారిటీ వస్తుంది. అప్పుడైనా మీరు అయోమయానికి గురి కారని నా నమ్మకం అంటుంది తిలొత్తమ్మ. అసలు నేను నయని కాదు త్రినేత్రి అని నేనే చాలాసార్లు చెప్పాను. అయినా మీరే వినడం లేదు అటుంది నేత్రి. ఇంతలో అఖండస్వామి తనే నేత్రి అని ఒప్పుకున్నప్పుడు నేను వచ్చి మిమ్మల్ని నమ్మించేలా చేయడానికి ఏముంటుంది అని అడుగుతాడు. ఇంతలో విశాల్ స్వామి మీకు ఎత దివ్యదృష్టి ఉందో నాకు తెలియదు కానీ తను మాత్రం నా భార్య నయనియే అని కచ్చితంగా చెప్తాడు విశాల్. విశాల్ మాటలకు నేత్రి షాక్ అవుతుంది.
మనకు ఇంకా పెళ్లి కాలేదు కదా బాబుగారు.. అప్పుడే నన్ను మీ భార్య అనడం ఏంటని అడుగుతుంది. దీంతో అఖండస్వామి కూడా తను నయని కాదని స్పష్టంగా చెప్తుంది. తనకు ఇంకా వివాహం కాలేదని చెప్తుంది. అయినా మీరు ఆమెను నమ్మడం లేదేంటని ప్రశ్నిస్తాడు. అయితే మీరు ఏదైనా సాక్ష్యం చూపిస్తే కానీ వీళ్లు నమ్మేటట్లు లేరు స్వామి అని తిలొత్తమ్మ అంటుంది. అయితే నాకు ఓ పది నిమిషాలు టైం ఇవ్వండి నేను మీకు తను నయని కాదని నిరూపిస్తాను అని చెప్తాడు అఖండస్వామి. తిలొత్తమ్మ, వల్లభలను తీసుకుని బయటకు వెళ్తాడు స్వామి.
విక్రాంత్ గార్డెన్‌లో కూర్చుని పని చేసుకుంటుంటే సుమన వచ్చి మీరు ఇలా ఉండటం నాకేం నచ్చడం లేదని అంటుంది. ఏందుకు ఏమైందని విక్రాంత్ అడగ్గానే అవతల అఖండస్వామి మా అక్కను అక్క కాదని నిరూపిస్తాను అని చెప్తుంటే మీరేమో ఇక్కడ ఇలా కూర్చున్నారు అంటుంది. వాళ్లు ఏమీ చేయలేరని నా పని నేను చేసుకుంటున్నాను అంటాడు విక్రాంత్.
నయని కాదని నిరూపిస్తానన్న స్వామి వల్లభ, తిలొత్తమ్మను ఇంట్లో ఎక్కడైనా నయని వేలి ముద్రలు ఉంటే తీసుకురమ్మని చెప్తాడు స్వామి. అయితే దసరా పండుగ నాడు నా తింగరి పెళ్లాంతో కలిసి పేపర్ మీద వేలి ముద్రలు వేశారు. అది తీసుకొస్తానని చెప్తాడు వల్లభ. అయితే ఎవరికీ తెలియకుండా తీసుకురా వల్లభ అని స్వామి చెప్తాడు. ఇంతటితో త్రినయని సీరియల్ నేటి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?