Hyderabad: హైదరాబాద్‌లో ఐదుగురు సభ్యుల ఫ్యామిలీ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమం కాగా, మరో నలుగురికి పర్వాలేదని వైద్యులు చెబుతున్నారు. ఏం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..
హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని కోదండరామ్ నగర్ ప్రాంతంలో ప్రసాద్ ఫ్యామిలీ ఉంటోంది. ఐదుగురు సభ్యుల ఈ ఫ్యామిలీ. ప్రసాద్(60), లతా (55), పిల్లలు సాయి స్వరూప్, సందీప్, వంశీలు. అయితే వీరికి ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి.
అసలు ఏం జరిగిందో తెలీదుగానీ ఈ ఫ్యామిలీకి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దాని నుంచి తేరుకోడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య ఒక్కటే కారణమని డిసైడ్ అయ్యారు ఇంటి పెద్దాయన.
సోమవారం రాత్రి సమయంలో పాయిజన్ తాగి ఫ్యామిలీ సభ్యులంతా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సరూర్‌నగర్ పోలీసులు ప్రసాద్ ఇంటికి చేరుకుని కుటుంబం మొత్తాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: త్రిపురలో దారుణం.. కన్నతల్లిని కుమారులే చెట్టుకు కట్టేసి సజీవ దహనం!
ప్రస్తుతం అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు ఔట్ ఆఫ్ డేంజర్ అని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ఆర్థిక సమస్యలకు కారణమేంటి? అనేదానిపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కుటుంబం
సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోదండరామ్‌నగర్‌లో ఘటన
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఒకే కుటుంబంలోని 5 మంది
సమాచారం అందుకుని, వారందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ఐదుగురిలో ఒకరి ప… pic.twitter.com/0nPYOrKkIi
— BIG TV Breaking News (@bigtvtelugu) September 30, 2024