OTT Movie ; ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ బో*ల్డ్ మూవీ అనుకుంటే మీరు పొరపడినట్టే. అఫ్కోర్స్ బోల్డ్ సన్నివేశాలు కూడా ఉంటాయనుకోండి. కానీ ఇది ఒక క్రైం థ్రిల్లర్ సినిమా. రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక సినిమా క్లైమాక్స్ చూసామంటే దిమాక్ కరాబ్ కావాల్సిందే. మరి ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…
మీరు టైటిల్ లో చదివినట్టుగానే ఈ మూవీలో హీరోయిన్ ఏకంగా తన భర్త ముందే ఇంకొకరితో ఎఫైర్ నడిపిస్తుంది. ఇద్దరూ కావాలనే ఈ పని చేస్తారు. పైగా ముగ్గురూ కలిసి పోలీసులకు చుక్కలు చూపిస్తారు. ప్రేమ పేరుతో వరుస హత్యలు చేస్తూ, ఒకరి కోసం ఒకరు పడిచచ్చే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని చూస్తే సీను సీనుకి ఒక ట్విస్ట్ తో దిమ్మతిరిగిపోతుంది. ఇక చివరి అరగంట చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో తాప్సి హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే…
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబ’. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ వపార్ట్ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందన్న విషయం తెలిసిందే. అందులో హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోగా మధ్యలో వచ్చిన కజిన్ ని లేపేసి ఇద్దరూ పారిపోతారు. ఇక సెకండ్ పార్ట్ విషయానికి వస్తే సినిమా మొదట్లోనే హీరోయిన్ ఒక బ్యూటీషియన్ గా, ఇండిపెండెంట్ యువతీగా ఒక్కతే నివసిస్తూ ఉంటుంది. హీరో అప్పుడప్పుడు సీక్రెట్ గా వచ్చి ఆమెను కలుస్తాడు. కానీ మరోవైపు ఇతను బ్రతికే ఉన్నాడన్న ఆలోచనతో పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఓ డాక్టర్ హీరోయిన్ పై మనసు పారేసుకుంటాడు. కానీ ఒకానొక టైంలో హీరోయిన్ తన భర్త జైలు పాలు కాకుండా ఉండడం కోసం ఏకంగా డాక్టర్ని పెళ్లి చేసుకుంటుంది. హీరో ఇది కరెక్ట్ కాదు అని ఎంత మొత్తుకున్నా సరే వినకుండా అతని ఒప్పించి అతని ముందే డాక్టర్ని పెళ్లాడుతుంది. తీరా ఫస్ట్ నైట్ వచ్చేసరికి ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ పెరుగుతుంది. కానీ ఓ రోజు డాక్టర్ తన సొంత వాళ్ళని చంపేశాడు అనే నిజాన్ని తెలుసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అతని నుంచి తనను కాపాడమని కంప్లైంట్ చేస్తుంది. దీంతో పోలీసులు ఇదే అదనుగా భావించి హీరోయిన్ దగ్గర నుంచి హీరో బ్రతికే ఉన్నాడన్న సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేయడంతో హీరో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి ఆమెను వదిలేస్తే తను లొంగిపోతానని పోలీసులకు హింట్ ఇస్తాడు. కానీ తీరా లొంగిపోయే టైంలో ముగ్గురూ కలిసి ఒక నదిలో దూకేస్తారు. మరి ఆ మొసళ్ళు ఉన్న నది నుంచి ఈ ముగ్గురు బయటపడగలిగారా? హీరోయిన్ మొదటి భర్త ఆమె కోసం చనిపోతే, ఈ డాక్టర్ ఎందుకని అక్కడి నుంచి దూకాడు? చివరికి ఏమైంది? అనే విషయం తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.