Hyderabad News: నిర్లక్ష్యం, అతివేగం కలిసి ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. శనివారం ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్‌లో మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అసలేం జరిగింది. ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్దాం.
వీకెండ్ వస్తే చాలు కారు బాబుల నిర్లక్ష్యం అంతా ఇంకా కాదు. అతి వేగం, నిర్లక్ష్యం కలిసి ఒకరి ప్రాణాల్ని బలి తీసుకుంది. శనివారం ఉదయం మూడు గంటల సమయంలో బంజారాహిల్స్‌లోని బసవతారకం కాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్‌పాత్ పైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకరు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన తర్వాత ఫుట్ పాత్‌పై ఉన్నవారు కారులోని వ్యక్తులను గమనించారు. దీంతో నిందితులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈలోగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అక్కడి ఉన్నవారి నుంచి సమాచారం తీసుకున్నారు పోలీసులు. మరోవైపు కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా వివరాలు సేకరించే పనిలోపడ్డారు. ఇంకోవైపు సమీపంలో సీసీటీవీ ఫుటేజ్‌ని చెక్ చేసి, కారు ఓనర్ నుంచి వివరాలు రాబట్టారు.
ALSO READ: వేడినీటిలో కెమికల్స్ కలిపి శవముక్కలను ఉడికించిన గురుమూర్తి.. ఎందుకు చేశాడంటే?..
ఆ కారుని నడిపిందెవరు? ఓనర్‌కు సంబంధించిన వ్యక్తులు నడిపారా? లేక వారి నుంచి ఎవరైనా తీసుకుని నడిపారా? రోడ్‌పై వస్తుండగా ప్రమాదం జరగడానికి కారణలేంటి? యాక్సిడెంట్ కు పాల్పడిక యువకులు మద్యం మత్తులో ఉన్నారా? అనేది పోలీసుల విచారణలో తేలనుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. కారు నడిపిన వారిలో నిజామాబాద్‌కి చెందిన షార్ట్ ఫిల్మ్ మేకర్ హర్ష వర్ధన్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నట్టు తెలుస్తోంది. మద్యం మత్తులో కారు నడిపినట్టు సమాచారం.
బంజారాహిల్స్ లో ఘోర రోడ్డుప్రమాదం
క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లిన కారు
ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి…మరో ఇద్దరికి గాయాలు
కారును అక్కడే వదిలేసి పారిపోయిన కారులోని వ్యక్తులు
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన pic.twitter.com/9SiItUWyUX
— BIG TV Breaking News (@bigtvtelugu) January 25, 2025