BigTV English

Shubman Gill: అనుభవం లేకున్నా అదరగొట్టారు: శుభ్ మన్ గిల్

Shubman Gill: అనుభవం లేకున్నా అదరగొట్టారు: శుభ్ మన్ గిల్
Advertisement

Shubman Gill Comments ( Today’s sports News) : భారత క్రికెట్ లో అనూహ్యంగా జింబాబ్వే టూర్ కి కెప్టెన్ గా వెళ్లిన శుభ్ మన్ గిల్ భావి భారత క్రికెట్ కెప్టెన్ గా తన పేరు సుస్థిరం చేసుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే జింబాబ్వే పర్యటనలో యువజట్టుతో వెళ్లి వారిని 4-1 తేడాతో ఓడించి సగర్వంగా ఇండియా తిరిగి వస్తున్నాడు.


ఆఖరి వన్డేలో 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన జింబాబ్వే 125 పరుగులకే ఆలౌట్ అయ్యింది 42 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముఖేష్ కుమార్ 4 వికెట్లు తీసుకున్నాడు. సంజూ శాంసన్ ఒంటరిగా పోరాడి 58 పరుగులు చేసి టీమ్ ఇండియాకు గౌరవ ప్రదమైన స్కోరు తీసుకొచ్చాడు.

ఈ నేపథ్యంలో గిల్ మాట్లాడుతూ జింబాబ్వే పర్యటనలో ఉన్న యువ క్రికెటర్లు చాలామందికి విదేశాల్లో ఆడిన అనుభవం లేదు. అయినా సరే, అద్భుతంగా ఆడారని అన్నాడు. మొదటి మ్యాచ్ ఓటమి అనంతరం దెబ్బతిన్న పులుల్లా చెలరేగారని, మనవారి ప్రదర్శన చూసి చాలా సంతోషంగా ఉందని అన్నాడు. వారి ప్రతిభను ఎంత చెప్పినా తక్కువే అన్నాడు. అందరూ కూడా వారి స్థాయికి మించి ఆడినట్టు తెలిపాడు. ఒక దశలో జట్టు కూర్పు చాలా కఠినంగా మారిందని తెలిపాడు. ఓపెనర్స్ తో జట్టు నిండిపోయిందని తెలిపాడు. అయినా సరే, మన కుర్రాళ్లు ఏ డౌన్ లోనైనా వెళ్లి చక్కగా ఆడి, మ్యాచ్ లను గెలిపించారని తెలిపాడు.


Also Read: కోపా అమెరికా కప్ విజేత అర్జెంటీనా.. 16 సార్లు టైటిల్ గెలిచిన రికార్డ్ సొంతం!

చివరి మ్యాచ్ లో సంజూ శాంసన్, ముఖేష్ కుమార్ రాణించారని తెలిపాడు. వారి వల్లనే విజయం దక్కిందని తెలిపాడు. సంజూ లాంటి సీనియర్ల అనుభవం ఇలాంటి సమయంలో అక్కరకు వస్తుందని తెలిపాడు. ఇక రాబోయే శ్రీలంక పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. ఇంతకుముందు ఆసియా కప్ కోసం శ్రీలంక వెళ్లిన అనుభవం ఉందని తెలిపాడు. అయితే జులై 28 నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్లే టీమ్ ఇండియా కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అక్కడ మూడు వన్డేలు, మూడు టీ 20లు ఆడనుంది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ గైర్హాజరీలో గిల్ ఓపెనర్ ప్లేస్ కి ఢోకా లేదని అంటున్నారు.

Related News

MLA Rivaba Jadeja: జడేజా సతీమణికి మంత్రి పదవి

Vikas Kohli: ఇంట్లో ఆస్తుల పంచాయితీ..కోహ్లీ సోద‌రుడు వివాద‌స్ప‌ద పోస్ట్‌

AUSW Vs BANW: బంగ్లా ఓట‌మి, టీమిండియాకు బిగ్ రిలీఫ్‌.. సెమీస్ కు దూసుకెళ్లిన ఆసీస్‌

Afg vs Ban: కొంప‌ముంచిన ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లా ప్లేయర్ల వాహనాలపై ఫ్యాన్స్ దాడి…!

Keerthy Suresh: ధోని కాపురంలో చిచ్చు.. కీర్తి సురేష్ కు సాక్షి వార్నింగ్…!

MS Dhoni Wife: బ‌య‌ట‌ప‌డ్డ ధోని భార్య సాక్షి బండారం..సిగ‌రేట్ తాగుతూ, నైట్ పార్టీలు ?

Test Twenty: క్రికెట్‌లో సరికొత్త ‘టెస్ట్ 20’ ఫార్మాట్…ఇక‌పై 80 ఓవ‌ర్ల మ్యాచ్ లు

Virat Kohli: కోహ్లీ ట్వీట్‌పై వివాదం.. డ‌బ్బుల మ‌నిషి అంటూ ఫ్యాన్స్ తిరుగుబాటు !

Big Stories

×