E-Paper
Advertisement

చివరి వరకు వణికించే భయంకరమైన హారర్ సినిమాలు… మస్ట్ వాచ్

చివరి వరకు వణికించే భయంకరమైన హారర్ సినిమాలు… మస్ట్ వాచ్
Advertisement

Best Horror Movies on OTT : భయం అంటే ఎలా ఉండాలో చూపించే సినిమాలను చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ సినిమాలు చూసేటప్పుడు ఒంటరిగా ఉన్నావంటే మాత్రం కచ్చితంగా పక్క తడిసిపోవాల్సిందే. ఈ ఐదు సినిమాలు హారర్ జానర్‌లో రత్నాలు లాంటివి. ఇవి గ్రాఫిక్స్ మీద కాకుండా కథనం, సౌండ్ ఎఫెక్ట్స్ తో భయం పుట్టిస్తాయి. వీలైతే అర్ధరాత్రి హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి, కిక్కు మామూలుగా ఉండదు.

1. REC (2007)

ఇది స్పానిష్ పౌండ్ ఫుటేజ్ సినిమా. ఒక అపార్ట్‌మెంట్‌లో వింత వ్యాధి సోకి జనం వింతగా ప్రవర్తిస్తుంటారు. ఒక రిపోర్టర్ తన కెమెరామెన్‌తో కలిసి ఆ బిల్డింగ్‌లోకి వెళ్తుంది. అక్కడ వాళ్ళు చూసే భీభత్సం మామూలుగా ఉండదు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ చూస్తే గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఆపిల్ టీవీ, యూట్యూబ్ లో ఇది అద్దెకు అందుబాటులో ఉంది.

2. It Follows (2014)

Advertisement

ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఒక వింత శక్తి మనుషులను వెంటాడుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. పారిపోయే కొద్ది వెంటాడుతూనే ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మన వెనుక కూడా ఏదో ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

3. Night of the Living Dead (1968)

హారర్ సినిమాల చరిత్రలో ఇదొక సంచలనం. చనిపోయిన వాళ్లు తిరిగి బతికి, మనుషులను తినడం అనే కాన్సెప్ట్ దీని నుంచే పాపులర్ అయ్యింది. పాత సినిమా అయినా సరే, అందులో ఉండే హారర్ సీన్లు, ఆ పాతకాలం నాటి మేకప్ ఇప్పటికీ భయపెడతాయి. ప్రస్తుతం
దీనిని యూట్యూబ్ లో ఉచితంగా నే చూడచ్చు.

4. Don’t Look Now (1973)

Advertisement

ఇది కేవలం దెయ్యాల సినిమా మాత్రమే కాదు, ఒక తండ్రి తన కూతురిని కోల్పోయిన బాధలో చూసే భ్రమలు, ఆ తర్వాత ఎదురయ్యే భయంకరమైన నిజాల చుట్టూ తిరుగుతుంది. సినిమా అంతా ఒక రకమైన డార్క్ మోడ్ లో ఉంటుంది. ఎండింగ్ ట్విస్ట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ. అమెజాన్ ప్రైమ్ లో దీనిని చూడవచ్చు.

5. The Texas Chain Saw Massacre (1974)

మాస్క్ వేసుకున్న ఒక సైకో కిల్లర్, చేతిలో రంపం పట్టుకుని వెంటాడుతుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది. ఇందులో రక్తపాతం కంటే ఆ వాతావరణం సృష్టించే భయం ఎక్కువ. హారర్ ఫ్యాన్స్‌కి ఇదొక కల్ట్ క్లాసిక్. ఇప్పటికీ భయంకరమైన రక్తపాతం సినిమాలలో దీనిని కూడా చెప్పుకుంటారు. ప్రైమ్ వీడియో, టుబి ఓటీటీలో ఇది అందుబాటులో ఉంది.

Read Also : నాలుగు గోడల మధ్య నడిచే ట్రయాంగిల్ ప్రేమ… అలాంటి సీన్లతో మతి పోగొడుతున్న మూవీ

Related News

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

అమ్మాయిలను చంపి పెళ్లి కూతుర్లలా అలంకరించే సైకో… సీటు అంచున కూర్చోబెట్టే ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ

ఉన్నట్టుండి పుట్టుకొచ్చే వింత పుట్టగొడుగులు… ఊళ్ళో జనాల విచిత్ర ప్రవర్తన… ఉత్కంఠ రేపే మలయాళం సర్ప్రైజ్ హిట్

చిరిగిన చొక్కాలు, చెరగని చిరునవ్వులు.. 80s నాటి ‘నేల టికెట్’ కిక్కే వేరబ్బా!

దేశ స్వాతంత్ర్యం కోసం ఊపిరి వదిలిన వీరుల గాథ… నరనరాల్లో దేశభక్తిని రగిలించే పవర్ ఫుల్ ఎపిక్ సిరీస్

ఐఏఎస్ ఆఫీసర్ తీర్చుకున్న షాకింగ్ ప్రతికారం… ఊహకందని పొలిటికల్ రివేంజ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×