E-Paper
Advertisement

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!
Advertisement

Vivo X300 Pro Price Cut: ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను మంచి ఆఫర్‌లో సొంతం చేసుకోవాలని చూస్తున్న వారికి ఇప్పుడు ఓ మంచి అవకాశం వచ్చింది. కెమెరా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ప్రీమియం లుక్‌తో పాటు టాప్ క్లాస్ ఫీచర్లు కావాలనుకునే వారి కోసం వచ్చిన Vivo X300 Proపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సాధారణంగా రూ.1,19,999 ధర కలిగిన ఈ ఫోన్‌ను.. కొన్ని బ్యాంక్ ఆఫర్లు ఉపయోగించుకుంటే మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ కెమెరా, అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకునే ఈ ఫోన్‌పై వచ్చిన ఈ డీల్ ఫ్లాగ్‌షిప్ కొనాలనుకునే వారికి నిజంగా మంచి ఛాన్స్. అయితే ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు కాబట్టి.. డీల్ నచ్చితే ఆలస్యం చేయకుండా ఓసారి చెక్ చేసుకోవడం మంచిది.

Advertisement

ఈ వివో X300 ప్రోను అమెజాన్ నుంచి కొనేటప్పుడు కొన్ని క్రెడిట్ కార్డులను వాడితే మంచి డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేస్తే ఏకంగా రూ.12,999 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ కార్డు లేకపోయినా టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఐసీఐసీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే రూ.10,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. వీటికి తోడు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

Also Read: రూ.10,000 లోపే 5G ఫోన్? Lava Bold N4 Proపై భారీ అంచనాలు.. ఫీచర్లు ఇవే!

Advertisement

Vivo X300 Proలో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది మంచి క్లారిటీతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. వీడియోలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. అలాగే ఇందులో 6510mAh పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి.. చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

ఫోన్ పనితీరు విషయానికి వస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ వాడారు. దీనివల్ల ఫోన్ లాగ్ లేకుండా చాలా స్పీడ్‌గా పనిచేస్తుంది. ఇక కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. వీటికి తోడు రెండు 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఇచ్చారు. ముందువైపు సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీంతో ఫొటోలు చాలా స్పష్టంగా వస్తాయి.

Also Read: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక Passkeysను ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు!

Tags

Related News

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!

80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్

రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!

తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే

అంతరిక్షం అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!

ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక Passkeysను ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు!

Big Stories

Advertisement
×