Janakiram Arrest: ఎట్టకేలకు జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ అరెస్టయ్యారు. రెండు రోజుల కిందట ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఆయన కుటుంబ సభ్యులు బయటకు రానివ్వలేదు, గోప్యంగా ఉంచారు. అసలు జానకీరామ్ కేసు డీటేల్స్ లోకి ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
స్టోరీలోకి వెళ్తే..
జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్‌కు కష్టాలు రెట్టింపు అయ్యాయి. గృహ హింస, భార్యను వేదిస్తున్న కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారాసిగూడ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు, చివరకు ఆయన్ని అరెస్ట్ చేశారు.
రెండు రోజుల నుండి ఆయన పోలీసుల అదుపులో ఉండటంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అరెస్టు చేసిన అంశాన్ని గోప్యంగా ఉంచారు పోలీసులు, కుటుంబ సభ్యులు. ఇప్పటికే GHMC నుండి పెరెంట్ డిపార్ట్మెంట్‌కి సరెండర్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని సస్పెండ్ చేశారు CDMA అధికారులు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలుకి తరలించారు.
అక్రమ సంబంధం జానకీరామ్ ఫ్యామిలీలో చిచ్చుపెట్టింది. జీహెచ్‌ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. హోదా పెద్దదే కావడంతో పైసలకు ఏ మాత్రం కొదవలేదు. వారాసిగూడకు చెందిన జానకీరామ్‌కు ఏడేళ్ల కిందట మ్యారేజ్ అయ్యింది. 2018లో కల్యాణిని ఆయన వివాహం చేసుకున్నారు. అయితే వీరికి పిల్లలు లేరు.
ALSO READ: కామంతో కళ్లు మూసుకుపోయాడు
ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఇదిలావుండగా మెదక్‌లో మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన సమయంలో ఓ మహిళతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆమెకు వివాహమై విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు. సీన్ కట్ చేస్తే.. ఇదికాకుండా ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో జాయింట్ కమిషనర్‌గా ఉన్న ఆయన, సీతాఫల్‌మండి డివిజన్ మధురానగర్‌లో ఆ మహిళతో ఉంటున్నాడు.
కొద్దిరోజులుగా జానకీరామ్ వ్యవహారశైలిలో మార్పులు రావడం ఆయన భార్య కల్యాణికి అనుమానం మొదలైంది. ఏదో జరుగుతుందని గుర్తించింది ఆమె. ఎలా కనిపెట్టాలన్న దానిపై ఆలోచన చేసిందామె. చివరకు భర్త వ్యవహారాన్ని గమనించింది. సికింద్రాబాద్ లోని లాలాపేట్ ప్రాంతంలో ఓ అమ్మాయితో అపార్టుమెంటులో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది భార్య కల్యాణి. ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా ఎలా పట్టుకోవాలన్న దానిపై ప్లాన్ చేసింది.
ఫిబ్రవరి 21న జానకీరామ్, మహిళ వద్దకు వచ్చాడు. అదే సమయంలో భార్య కల్యాణి, ఆమె బంధువులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి ఒక్కసారిగా షాకయ్యాడు జానకీరామ్. ఆ తర్వాత ఆయన్ని కల్యాణి బంధువులు చావబాదారు. ఈ విషయం ఇరుగుపొరుగు వారికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యభర్తలను స్టేషన్ కు తరలించారు.
ఇదేక్రమంలో భార్య కల్యాణి తన భర్తపై ఫిర్యాదు చేసింది. జానకీరామ్‌కు గతంలో మ్యారేజ్ జరిగిందని, ఈ విషయం అతని కుటుంబ సభ్యులు దాచిపెట్టారని ప్రస్తావించింది. తాను గర్భవతిగా ఉన్నప్పుడు వివరీతమైన టార్చర్ చేయడంతో గర్భస్రావమైందన్నారు. తనకు పిల్లలు లేరని భావించి ఇంటి నుంచి పంపించాలని ప్లాన్ చేశాడని పేర్కొన్నారు.
తనను చంపడానికి ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు, జానకీరామ్ చేసింది నిజమేనని తేలింది. చివరకు అరెస్ట్ చేసిన చంచల్‌గూడ జైలుకి తరలించారు.