Cigarette Pack Murder| మానవ ప్రపంచంలో ఈ రోజు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. జరగబోయే పరిణామాలు అంచనా వేయడం కాదు.. గతంలో వందల, వేల సంవత్సరాల క్రితం జరిగిన నిజాలైన టెక్నాలజీ ఆధారంగా తెలుసుకోవచ్చు. ఈ టెక్నాలజీ సైన్స్ రంగంలోనే కాదు ఆర్కియాలజీ, క్రైమ్ ఇన్‌వెస్టిగేషన్ లాంటి రంగాల్లో కూడా ఉపయోగపడుతుంది. తాజాగా ఒక హత్య కేసులో పోలీసులు అనూహ్యంగా హంతకుడెవరో టెక్నాలజీ ఆధారంగా తెలుసుకున్నారు. అయితే ఈ హత్య 48 ఏళ్ల క్రితం జరిగింది. దాదాపు 5 దశాబ్దాల క్రితం నాటి ఘటనలో నేటితరం పోలీసు అధికారులు ఒక సిగరెట్ ప్యాకెట్ ఆధారం మాత్రమే లభించగా.. దాంతోనే ప్రారంభించి మొత్తం క్రైమ్ సీన్ మళ్లీ పున:విచారణ చేశారు. ఈ విచారణలో ఇంతకాలం తప్పించుకొని తిరిగిని హంతకుడిని గుర్తించారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అది 1977వ సంవత్సరం అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రంలో సాంటా క్లారా కౌంటీలో ఒక యువతి హత్యకు గురైంది. ఆమె పేరు జీనెట్ రాల్స్‌టన్. జీనెట్ కు వివాహమై ఒక ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఆమె ఫిబ్రవరి 1, 1977 రోజు సాయంత్రం తన వోక్సవాగెన్ బీటెల్ కారులో తన స్నేహితులతో కలిసి ఒక పబ్ కు వెళ్లింది. అక్కడ అనుకోకుండా ఒక 21 ఏళ్ల యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. స్నేహితులతో సరదాగా పబ్ లో పార్టీ చేసుకుంటున్న జీనెట్ ఆ యువకుడి పట్ల ఆకర్షితులైంది. స్నేహితులను వదిలి ఆమె ఆ యువకుడితో వెళ్లిపోతుంటే ఆమె స్నేహితులు ఆపారు. ‘పరిచయం లేని యువకుడితో ఎక్కడికి వెళుతున్నావు’ అని ప్రశ్నించారు కూడా. అప్పుడామె వెళ్లిపోతూ.. ’10 నిమిషాల్లో తిరిగి వస్తాను’ అని చెప్పి వెళ్లిపోయింది.
ఆ తరువాత ఆమె తన కారులో ఆ యువకుడితో శారీరకంగా కలిసింది. కానీ ఆ యువకుడు ఓ సైకో ఆమెను శారీరకంగా అనుభవించి ఒక షర్టులో ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. ఆ తరువాత ఆ కారుకు నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఆ కారు పూర్తిగా కాలిపోలేదు. జీనెట్ చాలాసేపటి వరకు రాకపోవడంతో ఆమె స్నేహితులు వెతుకుతూ కారు పార్కింగ్ వరకు చేరుకున్నారు. అక్కడ సగం కాలిన కారులో జీనెట్ శవం చూసి భయపడిపోయారు. ఈ సమాచారం పోలీసులకు అందించారు. సాంటా క్లారా డిటెక్టివ్ పోలీసులు ఈ కేసులో విచారణ ప్రారంభించారు. కానీ ఆ యువకుడు ఎవరో తెలుసుకోలేకపోయారు. దీంతో ఆ కేసు అలా 48 ఏళ్ల వరకు పెండింగ్ లో ఉండిపోయింది.
అయితే తాజాగా సాంటా క్లారా డిటెక్టెవ్స్ 2024 సంవత్సరంలో పెండింగ్ కేసులన్నీ క్లియర్ చేయాలని మరోసారి జీనెట్ మర్డర్ కేసులో విచారణ ప్రారంభించారు. అయితే హత్య జరిగిన కాలంలో లేని అడ్వాన్స్ టెక్నాలజీ ఈ రోజు అందుబాటులోకి ఉంది. అందుకే ఆ రోజు కారులో లభించిన అన్ని వస్తువులను ఆధారాలు తీసుకొని మళ్లీ పరీక్షించారు. అందులో నుంచి కారులో లభించిన ఒక సిగరెట్ ప్యాకెట్ లభించింది. ఆ ప్యాకెట్ పై ఫింగర్ ప్రింట్స్ లభించాయి. వాటి ఆధారంగా ఆ ప్రింట్స్‌ని నేరస్తుల రికార్డ్ లో చెక్ చేశారు. అప్పుడు ఒక క్రిమినల్ వేలి ముద్రలతో అవి మ్యాచ్ అయ్యాయి. అతనెవరో కాదు ఒకప్పుడు అమెరికా సైన్యంలో సైనికుడుగా పనిచేసిన యుజీన్ సిమ్స్. ఇప్పుడు యుజీన్ వయసు 69 ఏళ్ల వయసు. అతడు అమెరికాలోని ఒహయో రాష్ట్రం జెఫర్ సన్ ప్రాంతం నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: విచిత్ర దొంగ.. బట్టలు లేకుండా వెళ్లి లక్షల స్మార్ట్ ఫోన్లు చోరీ
సిమ్స్ డిఎన్‌ఏ తో హత్య జరిగిన రోజు కారులో లభించిన వీర్యం సాంపిల్స్ ని కూడా పోల్చి చెక్ చేయగా.. అవి కూడా మ్యాచ్ అయ్యాయి. అమెరికా సైన్యంలో సైనికుడైన యుజీన్.. జీనెట్ ని హత్య చేసిన తరువాత 1978లో మాంటెరే కౌంటీలో మరో హత్య చేసేందుకు ప్రయత్నించాడు.. కానీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత కోర్టు అతనికి కోర్టు 4 ఏళ్లు జైల్లు శిక్ష విధించింది. ఆ జైలు రికార్డులు డిజిటల్ లేకపోవడంతో జీనెట్ హత్య కేసులో పోలీసులు వెతుకుతున్న యుజీన్ ఎక్కడున్నాడో తెలుసుకోలేక కేసుని పెండెంగ్ లో అలా పెట్టేశారు.
అయితే యుజీన్ కి ఇప్పుడు 69 ఏళ్ల వయసు. అతడు ఆ రోజు జీనెట్ లో ఫిజికల్‌గా కలిశాడనేది నిజం. కానీ అతనే ఆమెను హత్య చేశాడనేందుకు ఆధారలు లేవని అందుకే అతడిని అదుపులోకి తీసుకొని త్వరలోనే పూర్తి చేస్తామని సాంటా క్లారా కౌంటీ అటార్నీ అధికారికంగా తెలిపారు. ఈ కేసు గురించి జీనెట్ కుమారుడు అలన్ రాల్‌స్టన్ తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశాడు. తన తల్లికి న్యాయం ఆలస్యంగానైనా జరిగినందుకు సంతోషంగా ఉందని ఒక టీవి ఇంటర్‌వ్యూలో అన్నాడు. ‘టెక్నాలజీ, పోలీసుల శ్రమ ఇలాంటి పాత కేసులను కూడా పరిష్కరించగలవు అని నిరూపించాయి’ అని వ్యాఖ్యానించాడు.