Gujarat News: గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్‌మీడియా ఇద్దరు వ్యక్తుల మధ్య చిచ్చుపెట్టింది. ఫలితంగా పట్టరాని కోపంతో యువతి గొంతు కోసి చంపేశాడు ఆ యువకుడు. దీని వెనుక లవ్ మ్యారేజ్ కారణమని తెలుస్తోంది. ఈ స్టోరీ లోతుల్లోకి వెళ్తే..
గుజరాత్‌లోని భుజ్ ప్రాంతం ఈ ఘటనకు వేదికైంది. గాంధీధామ్‌లోని భరత్‌నగర్‌లో ఓ యువతి కుటుంబం నివాసం ఉంటోంది. యువతి ఇంటి పక్కనే 22 ఏళ్ల మోహిత్ సిద్ధపారా ఫ్యామిలీ ఉంటోంది. ఇరుగుపొరుగువారు కావడంతో ఆ రెండు కుటుంబాలు క్లోజ్‌గా ఉండేవి. యువతీ యువకుల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహంగా మారింది. చివరకు ప్రేమ చిగురించింది.
ఇంతవరకు స్టోరీ బాగానే నడిచింది. అయితే యువతి బీసీఏ చదువుతోంది. భుజ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తోంది. ప్రేమ అనేసరికి చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. వీరిమధ్య కూడా అలాంటి గొడవలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. తల్లి సూచన మేరకు యువతి మోహిత్ ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది.
ఆ తర్వాత ఆ యువకుడి సోషల్ మీడియాను బ్లాక్ చేసింది ఆ యువతి. ఈ విషయాన్ని తట్టుకోలేకపోయిన మోహత్.. తన స్నేహితులకు చెప్పాడు. చివరకు యువతి చదివే కాలేజీకి వెళ్లాడు మెహిత్. తనను సోషల్‌మీడియా లో ఎందుకు బ్లాక్ చేశావని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇకపై తనను కలవడానికి ప్రయత్నించొద్దని యువకుడికి గట్టిగా చెప్పింది ఆ అమ్మాయి.
ALSO READ: అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య, ఎక్కడ?
దీన్ని అవమానంగా భావించాడు. అప్పటికే తన వెంట కత్తి తెచ్చుకున్నాడు. అమ్మాయి గట్టిగా చెప్పేసరికి పట్టరాని కోపంతో అకస్మాత్తుగా దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ అమ్మాయి గొంతు కోశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఫ్రెండ్‌ని కత్తితో గాయపరిచాడు. చివరకు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ శనివారం మరణించింది. ఈ ఘటనపై భుజ్ ప్రాంతంలో యువతి యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే యువతి తల్లిదండ్రులు షాకయ్యారు. నిందితుడ్ని కఠినశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఈ హత్యను తీవ్రంగా ఖండించాయి కొన్ని కమ్యూనిటీలు. ఈ హత్య, మహిళలపై పెరుగుతున్న నేరాలపై తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి.
దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.