Couple Suicide: హైదరాబాద్‌లోని KPHBలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు దంపతులు. మొదట భర్త రామకృష్ణ గొంతు కోసి చంపేసింది భార్య రమ్యకృష్ణ. తర్వాత ఆమె గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. గత ఐదు రోజుల నుంచి ఆత్మహత్య చేసుకోవడానికి భార్యాభర్తలిద్దరూ ప్రయత్నించినట్లు ఏసిపి రవి కిరణ్ తెలిపారు.
అప్పుల బాధతో ఆత్మహత్య
ఈ జంట వివిధ సంస్థలలో భారీగా పెట్టుబడి పెట్టారు, కానీ గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన నష్టాలను వచ్చాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల వారిని చిన్న చూపుగా ఉండడం, సూటిపోటి మాటలకు.. తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారని తెలుస్తుంది.
Also Read: ఎట్టకేలకు ఫలించిన చంద్రబాబు కృషి.. కుప్పంలో కృష్ణమ్మకు సీఎం జలహారతి
రక్తపు మడుగుల్లో దంపతులు
అయితే ముందుగా రమ్మకృష్ణ తన భర్త గొంతు కోసి చంపింది. దీనితో అతను వెంటనే అక్కడే మరణించాడు. దీని తర్వాత, ఆమె తనపై తాను బ్లేడ్ వేసుకుని, తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ, ఆమె నొప్పితో గట్టిగా అరిచింది. దీంతో అక్కడి స్థానికులు వచ్చి చూసే వరకు ఆ జంట రక్తపు మడుగుల్లో కనిపించారు. వెంటనే స్థానికులు అంబులెన్స్‌కి సమాచారం తెలిపి అక్కడి సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే రమ్యకృష్ణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, దీనిపై మరిన్ని వివరాలు తెలుపుతామని ఏసీపీ చెప్పారు.