Illu Illalu Pillalu ToIlluday Episode August 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి ప్రేమ కు వచ్చిన లెటర్ ఏంటో తెలుసుకోవాలని అక్కడికి వెళుతుంది.. ప్రేమ ఉంటే ఆ పని చేయడం కుదరదు అని అత్తయ్య నిన్ను పిలుస్తుంది ప్రేమ వెళ్ళు అని చెప్తుంది. ప్రేమ అలా వెళ్ళగానే శ్రీవల్లి ప్రేమ గదిలో అన్నీ వెతుకుతుంది. ఆ లెటర్ ఎక్కడ పెట్టిందో అని వెతుకుతూ ఉంటుంది అంతలో ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్లి ఏంటత్తా పిలిచావంటే అని అడుగుతుంది.. అయ్యో శ్రీరామ నేనెందుకు పిలిచాను నిన్ను అని వేదవతి అంటుంది. వల్లి ఎందుకు పిలిచింది అని ఆలోచించుకుంటూ గదిలోకి వస్తుంది..
అసలు బల్లి నువ్వు ఎందుకు నన్ను పిలిచావు. అత్త ఎక్కడ పిలిచింది అసలు అని అరుస్తుంది. ఏమో అత్తయ్య పిలిచింది ఏమో అనుకొని చెప్పాను. ఇప్పుడు ఏమైంది అని వల్లి అడుగుతుంది. అయినా నువ్వు మా గదులు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మీ గదిలోకి రావద్దా ఏంటి ఇంకెప్పుడు రానులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. చిటికెలో తప్పించేసుకుంది ప్రేమ అని వల్లి బాధపడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. నర్మదా వాళ్ళ నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని బాధపడుతూ ఉంటుంది. సాగర్ నర్మదని ఓదారుస్తాడు.. అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు.. ఇంకా మీ నాన్నకి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా అలానే చూసుకుందామని అంటాడు. మా నాన్నకు అయిందని బాధ కాదు మా నాన్నకు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆయన మళ్లీ డిప్రెషన్ కి వెళ్తాడు అని నర్మదా అంటుంది. నాకోసం అన్ని వదులుకొని వచ్చిన నీకోసం మీ నాన్న కోసం నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాను అని సాగర్ అంటాడు.
నీ మాట నిలకడ లేనిది. ఈరోజు ఈ మాట అంటావు రేపు ఇంకొకటి అంటావు. ఏం చెప్తావో నీకే తెలియదు అదే నా బాధ అని అంటుంది.. సాగర్ నీకు మాట ఇచ్చిన ప్రకారం నేను గవర్నమెంట్ జాబ్ కొట్టి చూపిస్తానని అంటాడు. ఇక చందు బాధపడుతూ ఉంటాడు.. బావ భోజనం చేద్దాం రావా అని శ్రీవల్లి అడుగుతుంది. కానీ చందు మాత్రం నేను రాను నువ్వు నన్ను మోసం చేసావని దారుణంగా మాట్లాడుతాడు. ఇంత మోసం చేస్తావని తెలియలేదు. పెళ్లికి ముందు కూడా ఇలానే నన్ను మోసం చేసావా అసలు నేను నమ్మాలంటే నాకు భయమేస్తుందని అంటాడు.. ఆ మాటకు శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ప్రేమ కళ్యాణ్ ను కలిస్తే ఏమన్నా జరుగుతుందేమో అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అయితే నేను ఈ విషయాన్ని ధీరజ్ కి ఎందుకు చెప్పలేదు ఇంట్లో వాళ్లకు చెప్తే గొడవలు వస్తాయి కానీ.. ధీరజ్ నా కోసం అండగా నిలబడతాడు కదా అని ఆలోచిస్తుంది.. ధీరజు వెళ్తుంటే విశ్వం అడ్డుపడి లక్ష రూపాయలు కావాలి అని అనుకుంటున్నావు కదా ఇదిగో అని మొహాన విసిరేస్తాడు. ధీరజ్ కోపంతో రగిలిపోతాడు.. ప్రేమ ధీరజ్ కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడు.. అయితే ప్రేమ పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడే విశ్వంతో గొడవ పడడం చూసి ప్రేమ అడ్డుపడుతుంది..
Also Read: ఈ వారం దారుణంగా పడిపోయిన రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?
ధీరజ్ నేను చెప్పేది విను ధీరజ్ అని ఎంత చెప్పినా సరే ప్రేమ మాటను అసలు వినడు. వాడెవడో నేను మోసం చేసే పారిపోతుంటే నీ మెడలో తాళి కట్టి నేను తప్పు చేశానా? తాళి కట్టిన భార్యను వదిలేయమని వాడు అంటున్నాడు చూసావా ఇదంతా నీ వల్లే అని బాధపడతాడు. అక్కడితో ప్రోమో పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..