OTT Movie : ఈ ఏడాది వచ్చిన ఒక పంజాబీ వెబ్ సిరీస్ టాప్ రేటింగ్ తో ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సిరీస్ డ్రగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా, న్యాయం కోసం పోరాటం చేసే ఒక యువకుడి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. గ్రిప్పింగ్ స్టోరీ, దర్శకత్వానికి ఈ సిరీస్ ప్రశంసలు అందుకుంది. IMDbలో 9.9/10 రేటింగ్ ను పొందింది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
యూట్యూబ్ లో స్ట్రీమింగ్
‘ఖడ్‌పంచ్’ (Khadpanch) 2025లో విడుదలైన ఒక పంజాబీ వెబ్ సిరీస్. ఇది రబ్బీ తివానా దర్శకత్వంలో రూపొందింది. ఇందులో అమృత్ అంబీ (విక్కీ), సుఖ్ పిండీ ఆలా, బుట్టా బడ్బర్, బాబర్ ఖాన్, అమృత, ధుత్తా పిండీ ఆలా నటించారు. 2025 జనవరి 25న ట్రోల్ పంజాబీ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రీమియర్ అయిన ఈ సిరీస్ ఏడు ఎపిసోడ్స్ తో ఆకట్టుకుంటోంది.
కథలోకి వెళ్తే
పంజాబ్‌లోని ఒక గ్రామంలో విక్కీ అనే ఒక యువకుడు, తన గ్రామాన్ని డ్రగ్ సమస్య నుండి కాపాడాలని న్యాయం కోసం పోరాడుతాడు. గ్రామంలో సత్పాల్ అనే వ్యక్తి డ్రగ్ ట్రాఫికింగ్‌లో మునిగి, అవినీతి రాజకీయ నాయకులతో కలిసి గ్రామాన్ని నాశనం చేస్తుంటాడు. విక్కీ, తన స్నేహితులు వీర్‌పాల్, మిండీతో కలిసి సత్పాల్ ప్రమాదకర కార్యకలాపాలను బయటపెడుతాడు. ఇది ఒక పెద్ద గొడవకు దారితీస్తుంది. మరోవైపు విక్కీ తండ్రి అంతర్జాతీయ పెళ్ళిళ్ళకు వ్యతిరేకంగా ఉంటాడు. కానీ గ్రామ సమస్యలను పరిష్కరించడానికి అందరితో కలిసి పనిచేస్తుంటాడు. ఇప్పుడు కథ ఒక మలుపు తీసుకుంటుంది.
ఒకరోజు సత్పాల్ మొత్తం అవినీతి నెట్‌వర్క్‌ను విక్కీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బయటపెడతాడు. ఇది గ్రామంలో అలజడి సృష్టిస్తుంది. సత్పాల్ కుట్రలు అందరికీ తెలుస్తాయి. అతని దుర్మార్గాలు బయటికి వస్తాయి. ఇది న్యాయం కోసం విక్కీ చేసే పోరాటాన్ని మరింత బలపరుస్తుంది. ఈ సమయంలో విక్కీ తన ప్రియురాలితో కలసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఇక ఈ సిరీస్ క్లైమాక్స్ ఆసక్తికర ముగింపును ఇస్తుంది. విక్కీ గ్రామంలో మార్పు తీసుకొస్తాడా ? సత్పాల్ వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా ? విక్కీ లవ్ స్టోరీ ఏమవుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ పంజాబీ సిరీస్ ని మిస్ కాకుండా చుడండి.
Read Also : అయ్యయ్యో పెంచిన వింత జంతువుతోనే ఆ పాడు పని… జెండర్ మార్చుకుని అది చేసే అరాచకం చూస్తే దిమాక్ ఖరాబ్