BigTV English

OTT Movie : కళ్ల ముందే వరుస హత్యలు… కిల్లర్ ఆటలతో డిటెక్టివ్ కు నరకయాతన… క్లైమాక్స్ లో మైండ్ బెండయ్యే ట్విస్ట్

OTT Movie : కళ్ల ముందే వరుస హత్యలు… కిల్లర్ ఆటలతో డిటెక్టివ్ కు నరకయాతన… క్లైమాక్స్ లో మైండ్ బెండయ్యే ట్విస్ట్

OTT Movie : కొన్ని సినిమాలలో సైకో కిల్లర్స్ చేసే పనులు పోలీసులకు నిద్ర కరువయ్యేలా చేస్తాయి. అయినప్పటికీ అలాంటి స్టోరీలే కంటి రెప్ప వేయకుండా చూసేలా ఉంటాయి. ఇలాంటి స్టోరీ లైన్ తో రూపొందిన ఓ ఇంట్రస్టింగ్ మూవీని ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ మూవీ పేరు ‘ట్విన్ మర్డర్స్: ది సైలెన్స్ ఆఫ్ ది వైట్ సిటీ’ (Twin Murders: The Silence of the White City). 2019లో విడుదలైన స్పానిష్ యాక్షన్-అడ్వెంచర్, సైకలాజికల్ మిస్టరీ క్రైమ్-థ్రిల్లర్ చిత్రం ఇది. దీనికి డానియల్ కాల్పర్సోరో దర్శకత్వం వహించారు ఎవా గార్సియా సాయెంజ్ డి ఉర్తురి రాసిన అదే పేరుతో ఉన్న బెస్ట్‌సెల్లర్ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్‌ కి అందుబాటులో ఉంది.


స్పెయిన్‌లోని విటోరియా-గస్టీజ్‌లో ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న డిటెక్టివ్ ఇంట్రెస్టింగ్ స్టోరీనే ఈ మూవీ. జావియర్ రే (ఉనాయ్ లోపెజ్ డి అయాలా), ఆరా గరీడో (ఎస్టీబాలిజ్), బెలెన్ రూయెడా, మనోలో సోలో, ఇత్జియర్ ఇతునో (డాక్టర్ గుయెవారా), జోర్డి మోల్లా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాలో విటోరియా-గస్టీజ్‌లోని సాంతా మరియా కేథడ్రల్ వంటి చారిత్రక స్థలాలను అద్భుతమైన సినిమాటోగ్రఫీతో తెరపై చూడొచ్చు.

కథలోకి వెళ్తే…

విటోరియా-గస్టీజ్, బాస్క్ కంట్రీ, స్పెయిన్… 2019లో జరిగే ఈ కథ ఇది. క్రిమినల్ ప్రొఫైలింగ్‌లో నిపుణుడైన పోలీస్ ఆఫీసర్ ఉనాయ్ లోపెజ్ డి అయాలా (జావియర్ రే) చుట్టూ తిరుగుతుంది స్టోరీ. ఉనాయ్, తన భార్య మరణం తర్వాత వ్యక్తిగత గాయాలతో బాధపడుతూ, పని నుండి విరామం తీసుకుంటాడు. కానీ సాంటా మరియా కేథడ్రల్ క్రిప్ట్‌లో ఒక యువకుడు, ఒక యువతి ఒంటిపై నూలు పోగు లేకుండా శవాలుగా కన్పించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో హీరోని తిరిగి డ్యూటీలోకి పిలుస్తారు అధికారులు. ఈ హత్యలు 20 సంవత్సరాల క్రితం సీరియల్ కిల్లర్ టాసియో చేసిన హత్యలలాగే ఉంటాయి. అతను ఇప్పుడు జైలు నుండి విడుదల కాబోతున్నాడు.

ఉనాయ్, తన పార్ట్నర్ ఎస్టీబాలిజ్ (ఆరా గరీడో)తో కలిసి, ఈ హత్యలు కాపీకాట్ కిల్లర్ పనేనా లేక టాసియో తప్పు వ్యక్తిని జైలు పంపాడా ? అని దర్యాప్తు చేస్తాడు. దర్యాప్తు సమయంలో, ఉనాయ్ టాసియోను జైలులో కలుస్తాడు. అక్కడ హీరోకి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తుంది. కథలో మరో ముఖ్యమైన పాత్ర మారియో, ఒక డార్క్ సీక్రెట్ కలిగిన వ్యక్తి. అతనికి ఈ హత్యలతో ఉన్న సంబంధం ఏంటి? 20 ఏళ్ళ కిందట సీరియల్ కిల్లర్ ను అసలైన వాడినే పట్టుకున్నారా? ఇప్పుడు అచ్చం అలాగే మర్డర్స్ చేస్తుంది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Read Also : ఓటీటీలోకి న్యూ ఏజ్ యూత్ ఫుల్ డ్రామా… బెడ్ నుంచి ఆ సీన్ల దాకా అన్నీ ఉన్న స్టోరీ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Related News

OTT Movie : ట్రిప్పుకెళ్లి టీచర్ తో అర్ధరాత్రి అరాచకం… సైకో ట్రాప్ లో అడ్డంగా బుక్కయ్యే అమాయకురాలు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : విమానంలో వైరస్ లీక్… పిచ్చోడు చేసే మెంటల్ పనికి పైప్రాణాలు పైనే… సీను సీనుకో ట్విస్ట్ మావా

OTT Movie : భర్త చనిపోయాడని చెప్పి భార్యను లాక్కునే ఆఫీసర్… అతను తిరిగొచ్చి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : మనుషుల్ని చూస్తుండగానే మసి చేసే సైకో… ఎవెంజర్స్ ను మించిన శక్తి… ఓటీటీలో గత్తరలేపుతున్న సూపర్ హీరో మూవీ

OTT Movies: దొంగచాటుగా పక్కింటి అమ్మాయిని ‘అలా’ చూస్తాడు.. తర్వాత వాడికి నరకమే, సినిమా మొత్తం అలాంటి సీన్లే!

OTT Movie : ట్రాప్ చేసి పాడు పనులు… ఈ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే… దిమాక్ ఖరాబ్ చేసే రియల్ రివేంజ్ స్టోరీ

Big Stories

×