Vijayawada Railway Station: ఒక్కసారి ఊహించుకోండి… రోజుకు 2 లక్షల మంది ప్రయాణికులు, మెట్రో స్థాయి సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయిలో నిర్మితమైన రైల్వే స్టేషన్! ఇది ఊహ కాదు.. త్వరలో నిజం కాబోతోంది! దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు నోడి వేస్తూ రైల్వే శాఖ భారీ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకొచ్చింది.
రూ.946 కోట్ల ప్రాజెక్ట్.. టెండర్లకు రెడీ!
విజయవాడ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్న ఈ అభివృద్ధి ప్రాజెక్ట్‌కి మొత్తం రూ.946.60 కోట్లు ఖర్చు చేయనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన టెండర్లు పిలవబోతున్నారు. పక్కా ప్లానింగ్‌తో, డిజైన్‌తో, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పునర్నిర్మాణ ప్రణాళిక సిద్ధమైంది.
నిర్మాణానికి 3 సంవత్సరాలు.. కాంట్రాక్టర్‌కు 60 ఏళ్ల లీజ్
ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి మూడేళ్ల సమయం అంచనా. అయితే ప్రాజెక్ట్‌కు భూభాగాన్ని 60 ఏళ్ల పాటు లీజుగా ఇవ్వనున్నారు. అంటే 3 సంవత్సరాల నిర్మాణ కాలంతోపాటు మరో 57 సంవత్సరాలపాటు ఆ ప్రైవేట్ డెవలపర్ నిర్వహణ బాధ్యతలు చేపడతాడు. ఈ విధానం ద్వారా ప్రభుత్వంపై భారం తగ్గించడంతోపాటు, ప్రయాణికులకు మౌలిక సదుపాయాల పరంగా మెరుగైన అనుభవం అందే అవకాశం ఉంది.
నిర్మాణం పూర్తయితే..
విజయవాడ నగరం, రాష్ట్రానికి గుండెకాయగా పనిచేస్తోంది. సుమారు అన్ని దిశలకూ రైలు మార్గాలు కలిగి ఉండే ఈ నగరం నిత్యం లక్షలాది మంది ప్రయాణికుల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉంది. కానీ ఇప్పటి వరకు స్టేషన్ వాడుకకంటే వెనకబడి ఉందన్నది నిజం. కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే సరికి, రోజుకు 2 లక్షల ప్రయాణికుల్ని గౌరవంగా హ్యాండిల్ చేయగల సామర్థ్యం కలుగుతుంది.
మెట్రో లెవల్ సదుపాయాలకి రంగం సిద్ధం
ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఏ సదుపాయం కావాలన్నా అందుబాటులో ఉంటుంది. ఆధునిక వాల్క్‌వేస్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుడ్‌కోర్టులు, క్లీన్ టాయిలెట్లు, స్మార్ట్ డిస్‌ప్లే బోర్డులు, EV చార్జింగ్ స్టేషన్లు, మెరుగైన పార్కింగ్ వ్యవస్థ ఇలా అనేక వసతులు లభించనున్నాయి. అంతేకాదు, ఈ స్టేషన్‌ని ఆర్ట్, హెరిటేజ్ అంశాలతో కూడిన డిజైన్‌లో తీర్చిదిద్దేలా ప్రణాళిక ఉంది.
Also Read: Bitcoin India value: 2009లో మీరు ఇందులో రూ.2 పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈరోజు కోటీశ్వరులు అయ్యేవారు!
ఏపీకి మైలురాయి ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్ట్ విజయవాడకే కాకుండా, ఏపీకి ఎంతో కీలకం. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో అతి పెద్ద మార్పిడి కేంద్రంగా ఉన్న ఈ స్టేషన్ అభివృద్ధితో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పర్యాటక ప్రోత్సాహం, సేవల పెరుగుదల వస్తుంది. అటు సింగపూర్, దుబాయ్ వంటి ప్రైవేట్ మోడల్స్ ఆధారంగా రూపొందించబడుతున్న స్టేషన్లలో ఇది కూడా ఒక ముఖ్యమైన దశగా మారనుంది.
ప్రయాణ అనుభవం మరిచిపోలేని దిశగా..
ప్రయాణికులు ఇక రైల్వే స్టేషన్ అంటే చెత్త, దుమ్ము, తాగదగిన నీరు లేని స్థలం అనుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ రీడెవలప్‌మెంట్ తర్వాత ప్రయాణ అనుభవం ఏ మెట్రోపాలిటన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నదానికన్నా తక్కువగా ఉండదు. దీన్ని ఆధునికతతో పాటు సుళువు ప్రయాణం కోరుకునే భారతీయులకు ఓ బహుమతిగా భావించొచ్చు.
విజయవాడ రైల్వే స్టేషన్ మారినట్లయితే.. నగరమే మారుతుంది! ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రధాన స్టేషన్లకూ ఇదే తరహా అభివృద్ధి సంకేతం అవుతుంది. ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం, అమరావతిని కేంద్రంగా ఉంచుకుని ఏర్పడే ట్రాన్స్‌పోర్ట్ హబ్‌కు ఇది కీలకమైన అడుగు అవుతుంది.