Visakhapatnam Crime: విశాఖపట్నం గాజువాకలోని గ్రేటర్ విశాఖ మున్నిపల్ కార్పొరేషన్ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం విషాదకరంగా మారింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అధ్యక్షుతత నిన్న సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. పారిశుద్ధ్యం , మౌలిక వసతులు , అభివృద్ధి పనుల పురోగతిపై ఈ సమావేశం సమీక్ష జరిపినట్లు సమాచారం.
సమావేశం కొనసాగుతున్న సమయంలో మెకానికల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ గోవిందరాదు , చైర్మన్ పట్టాభిరామ్ అడిగిని ప్రశ్రలకు సమాధానం ఇస్తున్న క్రమంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతినొప్పి రావడంతో అక్కడున్న అధికారులు వెంటనే స్పందించి హుటాహుటిన గాజువాకలోని సమీప ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్పించారు.
అయితే… చికిత్స పొందుతూ గోవిందరావు నిన్నసాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు ,సహోద్యోగులు, జీవీఎంసీ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న అధికారి ఇలా అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. గోవిందరావు మృతిపై రాజకీయ వివాదం మెుదలైంది. స్వచ్ఛ ఆంధ్ర కొర్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ సమావేశంలో చూపిన ఒత్తిడి కారణంగానే గోవిందరావుకు గుండెపోటు వచ్చి మృతి చెందాడని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని.. అధికారులపై అనవసర ఒత్తిడి తేవడంపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: తాడిపత్రిలో హైటెన్షన్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
సమావేశం కొనసాగుతుండగా అధికారికి గుండెపోటు.. ఆపై మృతి
విశాఖ-గాజువాక జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్
సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అధికారులు
సమావేశంలో… pic.twitter.com/bSoO933wYa
— BIG TV Breaking News (@bigtvtelugu) January 23, 2026