E-Paper
Advertisement

Thalaivar 176: సూపర్ స్టార్ సరసన మోనికా.. బుట్టబొమ్మపై ట్రోల్స్.. అసలేమైందంటే?

Thalaivar 176: సూపర్ స్టార్ సరసన మోనికా.. బుట్టబొమ్మపై ట్రోల్స్.. అసలేమైందంటే?
Advertisement

Thalaivar 176:సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రజినీకాంత్ (Rajinikanth). ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలతో అదరగొడుతూ దూసుకుపోతున్న రజినీకాంత్.. గత ఏడాది ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం రజనీకాంత్ నుంచి వస్తున్న ‘జైలర్ 2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే తన 176వ సినిమా షూటింగ్లో బిజీ కానున్నారు రజినీకాంత్. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో హీరోయిన్ పూజా హెగ్డే ట్రోల్స్ ఎదుర్కోవడం గమనార్హం

తలైవార్ 176 లో పూజా హెగ్డే..

అసలు విషయంలోకి వెళ్తే.. గత కొంతకాలంగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న రజినీకాంత్.. కమలహాసన్ (Kamal Hassan) మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలన్నింటినీ చెక్ పెట్టి ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్ పంచుకోబోతున్నారు. అందులో భాగంగానే మొదట కమలహాసన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై.. రజినీకాంత్ తో తలైవార్ 176వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శిబి చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ తలైవార్ 176’ అనే తాత్కాలిక టైటిల్ ని పెట్టారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ లు అయిన పూజా హెగ్డే , ప్రియాంక అరుళ్ మోహన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు వార్తలు రాగా.. ఈ విషయంపై ఇప్పుడు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐరెన్ లెగ్ అంటూ భారీ ట్రోల్స్..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. గత కొంతకాలంగా పూజా హెగ్డే వరుస పరాజయాలు అందుకుంటోంది. దీనికి తోడు గత ఏడాది రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో “మోనిక” అనే స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకున్న ఈ బుట్ట బొమ్మకి.. హీరోయిన్ గా సరైన హిట్ అయితే పడలేదు. దీనికి తోడు ఈమె మరో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న ‘జన నాయగన్ ‘ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 9వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ కారణంగా ఇప్పుడు ఈ సినిమా కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ సినిమాతో విజయం అందుకొని మళ్లీ అవకాశాలు వరుసగా అందుకోవాలని ఎన్నో కలలుకంది పూజా హెగ్డే.

బుట్టబొమ్మ పై విమర్శలు..

ఇక దీంతో ఈమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ఈమె నటించిన ప్రతి సినిమా డిజాస్టర్ గానే మిగులుతోంది ఈమె ఒక ఐరన్ లెగ్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండగా.. అలాంటి ఈమెకు రజనీకాంత్ సినిమాలో అవకాశం ఏమిటి? రజనీకాంత్ సినిమాలో ఈమె హీరోయిన్ గా అవసరం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఊహాగాణాలు కూడా పూజా హెగ్డే పై విమర్శలు వెల్లువెత్తేలా చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు.

Advertisement

also read:Renudesai: మనుషులు మొత్తం పోతారు.. రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!

తలైవార్ 176..

రజనీకాంత్ నటించిన తలైవార్ 176 చిత్రానికి శిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమా కథ ఫైనల్ చేసినప్పుడు సుందర్ సి దర్శకత్వం వహిస్తారని అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాలవల్ల తప్పుకుంటున్నట్లు సుందర్ సి స్వయంగా ప్రకటించారు. దాంతో శిబి చక్రవర్తి రంగంలోకి దిగారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా రజినీకాంత్ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×