E-Paper
Advertisement

హైవేపై కూలిన విమానం.. టెక్ స్టార్టప్ సీఈఓ మృతి, ధ్వంసమైన పలు వాహనాలు

హైవేపై కూలిన విమానం.. టెక్ స్టార్టప్ సీఈఓ మృతి, ధ్వంసమైన పలు వాహనాలు
Advertisement

America: అమెరికాలోని టెక్సాస్ నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు మరో ఐదుగురు గాయపడ్డారు. నెట్‌జెట్స్‌కు చెందిన విమానం శాన్ జోస్ డెల్ కాబో నుంచి లారెడో ఎయిర్ పోర్టుకు వస్తుండగా మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం రోడ్డుపై కూలడంతో పలు వాహనాలు డ్యామేజ్ అయ్యాయి.

అమెరికాలోని టెక్సాస్‌లో హైవే కూలిన విమానం

Advertisement

టెక్సాస్‌లోని లారెడోలో మంగళవారం రాత్రి హైవేపై విమానం కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో రూడ్లపై వెళ్తున్న వాహనాలు డ్యామేజ్ అయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు తమ వాహనాల నుండి కిందకు దిగారు. కాక్‌పిట్ కిటికీని పగలగొట్టి విమానం లోపల ఉన్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

ఈ సమయంలో అక్కడ గందరగోళం నెలకొంది. ఘటన సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో ఒకరు మృతి చెందినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. రన్‌వేకు కూతవేటు దూరంలో విమానం నియంత్రణ కోల్పోయినట్టు తెలుస్తోంది. ఎదురుగా ఉండే విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టి రెండు ముక్కలైంది.

Advertisement

టెక్ స్టార్టప్ సీఈఓ మృతి, ధ్వంసమైన పలు వాహనాలు

ఈ ప్రమాదంలో ఆస్టిన్‌కు చెందిన క్యాపిటల్ ఫ్యాక్టరీ, స్టార్టప్ అధినేత జోషువా బేర్ స్పాట్‌లో మరణించాడు. విమానంలో మిగిలిన ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడినట్టు అధికారులు వెల్లడించారు. స్థానిక బ్యుటీషియన్ జైరా గార్జా, ఆమె భర్తతో పాటు మరికొందరు వాహనదారులను నిలిపివేసి విమానం వద్దకు పరుగులు తీశారు. అద్దాలు పగల గొట్టి లోపలి వారిని బయటకు తీసే ప్రయత్నం ఆ దృశ్యాల్లో కనిపించింది.

అత్యవసర రక్షణ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోవడంతో ఐదుగుర్ని కాపాడారు. దట్టమైన పొగ కారణంగా పోలీసు అధికారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్-జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

ALSO READ:  మురహరిపల్లిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి!

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×