Tanishq Jewellery Robbery: బీహార్ పట్టపగలు దోపిడీ దొంగలు బీభత్సం స్పష్టించారు. షాపులోకి చొరబడగానే దొంగలు కస్టమర్స్, సిబ్బందికి ఒక చోట చేర్చి తమ పని కానిచ్చేశారు. కేవలం ఆరుగురు దొంగలు అరగంటలో షాపు మొత్తాన్ని చోరీ చేశారు. సంచలనం రేపిన ఈ ఘటనలో ఇద్దరు అరెస్టు కాగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. అసలేం జరిగింది?
అసలేం జరిగింది?
బీహార్‌లోని బోజ్‌పూర్ జిల్లాలో గోపాలి చౌక్ ప్రాంతంలో తనిష్క్ బంగారు షాపు ఉంది. వ్యాపార సెంటర్ కావడంతో ఆ ప్రాంతమంతా నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే దొంగలు ఎప్పటి నుంచి ప్లాన్ చేశారో తెలీదు. సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో తనిష్క్ బంగారు షాపులోకి ఆరుగురు సభ్యు దొంగల ముఠా ఎంటరైంది.
వారంతా ముఖానికి మాస్క్‌లు, హెల్మెట్ ధరించారు. షాపులోకి చొరబడగానే దొంగలు గన్ చూపిస్తూ.. కొనుగోలు దారులు, షాపు సిబ్బందిని ఒక చోటు చేర్చారు. ఆ తర్వాత షాపులోని భారీ ఎత్తున నగలు, నగదును దొంగలించు కుపోయారు. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పట్టపగలే ఓషాపులోకి ప్రవేశించి దొంగలు ఈ విధంగా చేయడం స్థానికంగా కలకలం రేగింది.
అరగంట సేపు బీభత్సం
దొంగల ముఠా పక్కాగా ప్లాన్ ప్రకారం వచ్చినట్టు కనిపించింది. సుమారు అరగంట పాటు షాపులో ఉన్నారు. వారంతా గన్‌లతో షాపులోకి ఎంట్రీ ఇచ్చిన ముఠా ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించారు. ముందుగా నగల షాపులో ఉన్నవారిని బెదిరించి వారిని తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నగలను, క్యాష్ కౌంటర్‌లో ఉన్న నగదు దొంగిలించుకుపోయారు.
ALSO READ: హైదరాబాద్‌లో ఘోరం.. పిల్లలను చంపి, ఆపై దంపతుల సూసైడ్
నగలు దోచుకున్న తర్వాత వెళ్తూ సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న గన్‌ను సైతం దొంగలు తీసుకుపోయారు. దొంగల బీభత్సం గురించి తెలియగానే పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పటికే దొంగలు అక్కడ నుంచి పారిపోయారు. వెంటన అప్రమత్తమైన పోలీసులు, ఆ ప్రాంతంలో జల్లెడ పట్టారు. ఆ దొంగల్లో ఇద్దరు పోలీసులను చూసి తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. షూట్ చేసి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వారి నుంచి నాలుగు బండిల్స్ జ్యూయలరీని స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు తప్పించుకున్నారు. షాపు దొంగతనం ఎలా జరిగిందనే దానిపై సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు. త్వరలో మిగతా నలుగుర్ని పట్టుకుంటామని చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తనిష్క్ షాపు ఉద్యోగులు ఏమన్నారు?
షోరూమ్‌కు కేవలం 600 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. తాము 25 నుండి 30 సార్లు పోలీసులకు కాల్స్ చేశామని తనిష్క షాపు ఉద్యోగులు చెబుతున్నారు. అరగంట వరకు పోలీసులు షోరూమ్ వద్దకు రాలేదని అంటున్నారు. ఫోన్ చేసి వెంటనే రియాక్ట్ అయితే దొంగతనం జరిగేద కాదని అంటున్నారు.
తనిష్క్ షోరూమ్ మేనేజర్ కుమార్ మృత్యుంజయ్ మాట్లాడుతూ షాపు నుండి దాదాపు రూ.25 కోట్ల విలువైన ఆభరణాలు దొంగిలించారని చెప్పారు. అందులో బంగారు ఆభరణాలు ఎంత? నగదు ఎంత అనేది తెలియాల్సివుంది.
పోలీసుల వెర్షన్
తనిష్క్ షోరూమ్‌లో ఐదు నుండి ఆరుగురు నేరస్థులు దోపిడీకి పాల్పడ్డారని జిల్లా ఎస్పీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నేరస్థులను గుర్తించే పనిలో పడినట్టు తెలిపారు. త్వరలో వారిని అరెస్టు చేస్తామని భోజ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ రాజ్ తెలిపారు.