E-Paper
Advertisement

ఖాకీలకైనా తప్పని సైబర్ షాక్.. ఆర్టీఏ చలాన్ పేరుతో ఏఎస్సైకే టోకరా!

ఖాకీలకైనా తప్పని సైబర్ షాక్.. ఆర్టీఏ చలాన్ పేరుతో ఏఎస్సైకే టోకరా!
Advertisement

APK Scam: సైబర్ నేరగాళ్లు ఎంతటివారినైనా వదలిపెట్టడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నరసయ్యే వీరి బారిన పడ్డారు. ఆర్టీఏ (RTA) చలాన్ పేరుతో వచ్చిన ఒక లింక్ ఆయనను కోలుకోలేని దెబ్బతీసింది.

ఈ నెల 8వ తేదీన నరసయ్య మొబైల్ ఫోన్‌కు వరుసగా మెసేజ్‌లు వచ్చాయి. ఏంటా అని ఆయన పరిశీలించేసరికి గుండె గుభేల్‌మంది. తన ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతా నుండి విడతల వారీగా డబ్బు కట్ అవుతున్నట్లు గుర్తించారు. అలా చూస్తూ చూస్తూనే ఆయన అకౌంట్ నుండి మొత్తం రూ. 49,139 మాయమయ్యాయి.

Advertisement

అసలేం జరిగిందని ఆరా తీయగా.. సైబర్ కేటుగాళ్లు ఆర్టీఏ చలాన్ కట్టాలంటూ ఆయన మొబైల్‌కు ఒక ఏపీకే (APK) ఫైల్‌ను పంపినట్లు తేలింది. నిజమైన చలాన్ అనుకుని ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడంతో, నరసయ్య ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. దీంతో వారు బ్యాంక్ వివరాలను దొంగిలించి క్షణాల్లో సొమ్మునంతా కాజేశారు.

బాధిత ఏఎస్సై వెంటనే అప్రమత్తమై సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సైతం ఇలాంటి మోసాల బారిన పడటం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. గుర్తుతెలియని వ్యక్తులు పంపే యాప్‌లు, ఏపీకే ఫైల్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇన్‌స్టాల్ చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: నీట్ లీకేజీలపై రాహుల్ గాంధీ పోరాటం.. యువతకు అండగా కాంగ్రెస్- మల్లిఖార్జున ఖర్గే

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×