Hyderabad Nampally Incident: హైదరాబాద్‌లోని నాంపల్లి MNJ క్యాన్సర్ హాస్పిటల్ వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు వ్యక్తిని అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నాంపల్లి పోలీసులు మృత దేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు ఎవరు చంపారు.. ఎందుకు ఈ ఘటన జరిగింది.. హత్యకు జరిగిన వ్యక్తికి ఇతనికి ఎమైన గొడవలు ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయాన్ ఖురేష్ అనే వ్యక్తి జువెనైల్ కోర్టుకి ఈ రోజూ వాయిదా ఉండటంతో నాంపల్లికి
వచ్చి వెళ్తుండగా అతనిని ఫాలో అవుతున్న ముగ్గురు అక్కడ ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా అతనిపై బ్యాట్‌లు కత్తులతో దాడి చేసి, గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన అనంతరం బ్యాట్‌లు, కత్తులు అక్కడే వేసి పారిపోయారు. అయితే పాత కక్ష్యలతోనే హత్య చేశారా.. లేదంటే ఏ కారణం చేత హత్య చేశారని ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే చిన్నతనంలోనే అంటే అతను మైనర్‌గా ఉన్న సమయంలోనే మృతుడు ఒక మర్డర్ కేసులో పాల్గొన్నాడు. దాంట్లో భాగంగానే జువెనైల్ కోర్టు వాయిదా ఉన్న సమయంలో అక్కడికి వచ్చి వెళుతుంటారు అని తెలిపారు.
Also Read: నరాలు కట్ చేసి.. తల పగలగొట్టి.. అనుమానంతో భార్యను దారుణంగా చంపిన భర్త
ఈ క్రమంలోనే అతని ముందుగా బ్యాట్‌తో కొట్టి, తర్వాత కత్తులతో విచక్షణ రహితంగా హత్య చేయడం జరిగిందని చెబుతున్నారు. అక్కడికక్కడే స్పాట్‌లోనే అయాన్ ఖురేష్ చనిపోవడం జరిగింది. నేరస్థులను పట్టుకుంటే తప్ప ఈ కేసుకు సంబంధించి ఎందుకు హత్య చేశారు అనేది బయటపడే అవకాశం ఉంది.