Pranay Case Verdict: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది ప్రణయ్ హత్య కేసు. దీనిపై నల్గొండ న్యాయస్థానం సోమవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి నల్గొండ ఎస్పీ, ప్రస్తుతం హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ రియాక్ట్ అయ్యారు. ఇది పరువు హత్యలేనని అన్నారు. ఒక వ్యక్తిని చంపడం సరైన పద్దతి కాదన్నారు. కేసును చాలా పకడ్బందీగా విచారించామన్నారు. అన్ని ఆధారాలతో నిరూపించామని, మారుతీరావు చాలా సెన్సిటివ్ వ్యక్తి అని చెప్పారు. ఆయన చనిపోవడం బాధాకరమన్నారు.
ప్రణయ్ హత్య కేసును చాలా జాగ్రత్తగా విచారణ చేపట్టామన్నారు. విచారణ తర్వాత కేసు ట్రయల్ జరిగినప్పుడు మ్యానేజ్ (క్రాస్ ఎగ్జామ్‌లో తప్పు బట్టకుండా) చేస్తారనే అనుమానం వచ్చిందన్నారు. ఒకవేళ అలా చేస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేదానిని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేశామన్నారు.
ఛార్జిషీటు తయారు చేయడానికి 9 నెలలు పట్టిందన్నారు అధికారి రంగనాథ్. డ్రాఫ్ట్ ఛార్జిషీటును దాదాపు 10 సార్లు మార్చినట్టు చెప్పుకొచ్చారు. గంటల కొద్దీ ఈ కేసుపై ఫోకస్ చేశామన్నారు. ఈ కేసులో టెక్నాలజీని వినియోగించామన్నారు. గేటు వద్ద ప్రణయ్‌ని నరికినప్పుడు ఆ గేటుపై లోతుగా స్టడీ చేశామన్నారు.
ఏ-2గా శర్మ హత్య చేసి ఆ రోజు బీహార్‌కు వెళ్లిపోతున్నాడని, రైలు దిగకముందే అతడ్ని పట్టుకుని అరెస్టు చేశామన్నారు. నిందితులు చాలామంది వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లారని, నాలుగు రోజుల్లో అందర్నీ గుర్తించామన్నారు. మొదట్లో ఈ కేసును పోలీసులు నీరు గార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రకరకాలుగా వాదనలు వచ్చినప్పటికీ అవేమీ పట్టించుకోలేదన్నారు.
ALSO READ: ప్రణయ్ హత్యకేసులో కీలక తీర్పు
మారుతిరావు చనిపోయినప్పుడు తాను చాలా బాధపడ్డానని అన్నారు ఐపీఎస్ అధికారి రంగనాథ్. కూతురు వేరేగా పెళ్లి చేసుకోవడం ఒక తండ్రిగా ఆయన బాధపడవచ్చన్నారు. ప్రతీ తండ్రి తమ పిల్లల బాగోగులు చూసుకుంటారని అన్నారు. అలాగని వేరేవాళ్ల ప్రాణాలు తీయడం కరెక్టుకాదు, ఆ హక్కు ఎవరికీ లేదన్నారు. ఆయన చనిపోయినప్పుడు బాధపడ్డామని మనసులోని మాట బయటపెట్టారు.
కూతురిపై ప్రేమతో ఈ విధంగా చేసి ఉంచవచ్చనేమోనని తెలిపారు. ఇది ముమ్మాటికీ పరువు హత్యగా చెప్పారు. డబ్బులు కూడా ఇన్వాల్వ్ అయ్యిందన్నారు. హత్య కేసుల్లో తీవ్ర నేరాలు చేసిన వ్యక్తులు ఉన్నారని, సిస్టమ్స్‌ని ఎలా మ్యానేజ్ చేయాలో వారికి తెలుసన్నారు. అలాంటి వాళ్లంతా ఉన్నారని, దర్యాప్తు చేసినప్పుడు వీళ్లంతా ఎలా వచ్చారని ఆశ్చర్యపోయామన్నారు.
ఇది పరువు హత్య: రంగనాథ్
మరో ఇంటికి చెందిన వ్యక్తిని చంపడం సరికాదు
ఈ కేసును చాలా పకడ్బందీగా విచారించాం
అన్ని ఆధారాలతో కేసును నిరూపించాం
మారుతీరావు చాలా సెన్సిటివ్.. ఆయన చనిపోవడం బాధాకరం
– రంగనాథ్, నాటి నల్గొండ జిల్లా ఎస్పీ pic.twitter.com/5RoDXUUx35
— BIG TV Breaking News (@bigtvtelugu) March 10, 2025