Couple Missing Case: కొత్తగా పెళ్లయిన జంట. మేఘాల్లో తేలిపోతూ మేఘాలయలో వాలిపోయింది. కలల రెక్కలు తొడిగి.. ప్రకృతి ఒడిలో పరవశించిపోయింది. జీవితకాల బంధానికి ఆ మధుర జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకోవాలనుకుంది. కానీ అందాల జంట ఆ లోయలో అదృశ్యమైపోయింది. దారితప్పారేమోనని వెతుకుతుంటే.. హత్యకు గురైన భర్త మృతదేహం లభ్యమైంది. నవవధువు కనిపించలేదు. తాజాగా ఈ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
మేఘాలయాల్లో ఇండోర్‌కి చెందిన నవవ దంపతుల మిస్టరీ ఇప్పుడు కలకలం రేపుతోంది. హనీమూన్‌కి వెళ్లిన సోనమ్, రఘవంశీ ఇద్దరూ కూడా అదృశ్యమయ్యారు. 11 రోజుల తర్వాత రఘవంశీ డెడ్ బాడీ కనపించింది. అయితే అతని భార్య సోనమ్ ఆచూకి ఇంకా లభించలేదు. తాజాగా సీసీటీవి పుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. భర్త డెడ్ బాడీ దగ్గర సోనమ్ ధరించిన షర్ట్ కనబడింది. మే 20న హమీమూన్ కోసం ఈ జంట వెళ్లింది. ఓ జలపాతం సమీపంలోనే లోతైనా లోయలో రఘవంశీ మృతదేహం కనిపెట్టారు పోలీసులు.
మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో.. దారుణమైన నిజం బయటపడింది. భర్తను భార్యే చంపించినట్లు పోలీసులు తేల్చారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సోనమ్, రాజా రఘువంశీ దంపతులు.. గత నెలలో హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో తిరిగిన తర్వాత.. మే 23న ఇద్దరూ కనిపించకుండాపోయారు. వారి కోసం గాలించిన పోలీసులకు.. పది రోజుల తర్వాత రాజా మృతదేహం కనిపించింది. సోనమ్ ఆచూకీ లేకపోవడంతో.. ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. చివరికి ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు.
భర్త హత్యకు నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లతో కుట్ర పన్నిన సోనమ్.. వాళ్లను మేఘాలయకు పిలిపించింది. అదను చూసుకుని భర్త రాజాను చంపించింది. ఆ తర్వాత రాజా మృతదేహాన్ని ఓ లోయలో విసిరేసి.. సోనమ్‌తో పాటు నిందితులంతా పారిపోయారు. భార్యాభర్తలు కనిపించకుండా పోవడంతో.. పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేశారు. రాజా మృతదేహం దొరికాక, సోనమ్ జాడ కోసం గాలించారు. ఆమె ఘాజీపూర్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు.
Also Read: బీర్‌బాటిల్‌తో కొట్టి.. అందుకే చంపా.. ఇంటర్ స్టూడెంట్ హత్య వెనుక సంచలనం
తన నిర్వాకం పోలీసులకు తెలిసిపోవడంతో.. సోనమ్ పోలీసుల ముందు లొంగిపోయారు. సోనమ్‌తో పాటు ఆమెకు సహకరించిన ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. రాజా హత్య కోసం నిందితులు ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.