Student Suicide: ఈ మధ్య కాలంలో విద్యార్ధుల ఆత్మహత్యలు వరుసగా జరుగుతానే ఉన్నాయి. రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతున్న ప్రజలు మాత్రం ఏ మాత్రం మారడంలేదు.. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి ఘటనే మరోకటి చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లాలోని నయీంనగర్‌లో ఉన్న ఎస్సార్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మిట్టపల్లి శివాని (16) క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
తనకు చదువు అర్దం కావట్లేదంటూ సూసైడ్ నోట్.
హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న శివాని, చదువులోని ఒత్తిడి, అర్థం కాని పాఠ్యాంశాల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలిపారు. ఆమె వదిలిపెట్టిన సూసైడ్ నోట్‌లో తన మానసిక స్థితిని వెల్లడించింది. చదువు అర్థం కాకపోవడం, దానితో పాటు తల్లిదండ్రులు తన ఇబ్బందులను అర్థం చేసుకోకపోవడంతో మనసు కుంగిపోతోందని ఆ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించే ముందు వారి ఆసక్తులను, సామర్థ్యాలను అర్థం చేసుకొని వారికి ఇష్టమైన కోర్సుల్లో చేర్పించాలని సూచిస్తూ, శివాని తన తల్లికి ఈ నోట్‌ను రాసింది.
అర్థం కాని చదువు చదవలేక, పేరెంట్స్ అర్థం చేసుకోక టెన్షన్..
ఈ ఘటన విద్యార్థులపై చదువు ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యల గురించి తీవ్ర చర్చను రేకెత్తిస్తుంది. శివాని ఎంపీసీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) వంటి సవాలుతో కూడిన కోర్సులో చేరినప్పటికీ, ఆమెకు పాఠ్యాంశాలు అర్థం కాకపోవడం వల్ల ఒంటరితనం, నిస్సహాయతకు గురైనట్లు తెలుస్తోంది. హాస్టల్ జీవనం, కుటుంబం నుండి దూరంగా ఉండటం కూడా ఆమె మానసిక ఒత్తిడిని మరింత పెంచింది. ఈ ఘటన తల్లిదండ్రులు, విద్యాసంస్థలు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఉందని తెలియజేస్తుంది.
తీరని శోకం..
స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది నుండి సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులు వారి పిల్లలకు నచ్చిన చదువుని చదవడంలో ప్రోత్సహించాలని, అలాగే వారి ఆశయాలను వారి పిల్లలపై రుద్దకుడదని పలు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల అయిన.. తల్లిదండ్రులు మారి వారి పిల్లలను వారికి నచ్చిన చదువును చడవడంలో ప్రోత్సహించాలని తెలియజేస్తున్నారు.
Also Read: ఆడపిల్ల వద్దనుకొని అబార్షన్.. సీన్ కట్ చేస్తే
పిల్లలు తప్పుడు మార్గంలో వెళుతుంటే సరిదిద్దండి కానీ, చదువులో మాత్రం వారికి ఇష్టమైన మార్గంవైపు వెళ్లనివ్వండి.. అప్పుడే వారు ఫ్యూచర్‌లో ఉన్నత స్థాయిలకు ఎదుగలానే ఆశయం ఏర్పడుతుంది. లేదంటే.. వారికి ఇష్టమైన చదువు చదవలేక… తల్లిదండ్రుల మాట కాదనలేక తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనుల మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే అది తల్లిదండ్రుల చేతిలోనే ఉందంటున్నారు.