Israel Tourist Gang Rape| కర్ణాటక రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఇద్దరు మహిళలో ఒకరు ఇజ్రాయెల్ పౌరురాలు కాగా.. మరొకరు స్థానిక యువతి. ఇద్దరూ నదీ ఒడ్డున సేద తీరుతున్న సమయంలో వారిపై దాడి జరిగింది. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఒక యువకుడిని దుండగులు హత్య చేశారు. ఈ భయానక ఘటన బెంగుళూరు నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పల్ అనే ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కొప్పల్ పట్టణంలో బేలా (పేరు మార్చబడినది) అనే 29 ఏళ్ల ఒక యువతి ఇంట్లో నలుగురు పర్యటకులు అద్దెకు ఉంటున్నారు. వారిలో ఒకరు ఇజ్రాయెల్ మహిళ కాగా, ఒకరు అమెరికాకు చెందిన యువకుడు డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన బిబాష్ అనే ముగ్గురు యువకులు ఉన్నారు. ఈ నలుగురితో ఇంటి ఓనర్ అయిన బేలా స్నేహంగా ఉంటోంది.
ఈ క్రమంలో ఈ అయిదుగురు గురువారం మార్చి 6, 2025 రాత్రి కలిసి డిన్నర్ చేశారు. ఆ తరువాత కాసేపు ఇంటికి సమీపంలో ఉన్న తుంగభద్ర నదీ ఒడ్డున నడుచుకుంటూ వెళ్లి సరదాగా కూర్చున్నారు. నదీ ఒడ్డున కాసేపు పడుకొని ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ సేద తీరుతుండగా.. అక్కడికి ఇద్దరు యువకుడు బైక్ పై వచ్చారు. అక్కడ వారితో కాస్త సాయం కోరినట్లు ముందుగా నటించారు. తమ బైక్ లో పెట్రోల్ అయిపోయిందని.. సమీపంలో ఎక్కడైనా పెట్రోల్ లభిస్తుందా? అని అడిగారు. ఆ తరువాత తమ వద్ద డబ్బులు లేవని.. వారిని సాయం చేయమని అడిగారు.
Also Read: కాళ్లకు మేకులు కొట్టి ఆమెను దారుణంగా చంపేశారు- భయంతో వణికిపోతున్న జనం
ఆ ఇద్దరు యువకుల పట్ల అనుమానంగా చూసిన పంకజ్, బిబాష్ తో వారిని అక్కడి నుంచి వెళ్లిపోమని అన్నారు. దీంతో ఆ ఇద్దరు యువకులు ముందుగా పంకజ్, బిబాష్ ని నదిలోకి తోసేశారు. పక్కనే ఉన్న మరో అమెరికా యువకుడిని కూడా కొట్టి నదిలో పడేశారు.
ఆ తరువాత అక్కడ మిగిలిన బేలా, ఇజ్రాయెల్ యువతిని డబ్బులు ఇవ్వమని బెదిరించారు. కానీ ఇద్దరు యువతులు వారి నుంచి తప్పించుకొని పారిపోతుండడంతో ఆ ఇద్దరు దుండగులు వారిని పట్టుకొని చితకబాదారు. బేలా, ఇజ్రాయెల్ యువతిపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేశారు. ఆ తరువాత వారి వద్ద ఉన్న డబ్బులు, విలువైన వస్తువులు తీసుకొని అక్కడి నుంచి బైక్ పై పారిపోయారు.
కాసేపు తరువాత నదిలో పడిపోయిన పంకజ్, అమెరికా యువకుడు ఈదు కుంటూ ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నారు. కానీ బిబాష్ మాత్రం నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వారి ఫోన్లు కూడా దుండగులు దోచుకుపోవడంతో వారు అతి కష్టం మీద పోలీసులను సంప్రదించారు. పోలీసులు సమాచారం అందుకొని ఘటానా స్థలానికి చేరుకున్నారు. బేలా, ఇజ్రాయెల్ యువతిపై అత్యాచారం జరిగిందని తెలుసుకొని వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరుసటి రోజు పోలీసులు నదిలో కొట్టుకుపోయిన ఒడిశా యువకుడు బిబాష్ కోసం గాలించగా.. సుదూరంగా నది పక్కన ఒడ్డున అతని శవం లభించింది.
దీంతో పోలీసులు గుర్తు తెలియని ఇద్దరు దుండగులపై హత్య, సామూహిక అత్యాచారం, దోపిడీ కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే వారిని గుర్తించి పట్టుకుంటామని కొప్పల్ ఎస్ పీ అరసిద్ధి మీడియాతో చెప్పారు.