Pradeep Ranganathan ..ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan).. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో గురించి ఎక్కడ చూసినా వార్తలు వినిపిస్తున్నాయి. అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. దీంతో అదృష్టం అంటే ఇతడిదే అంటూ పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రదీప్ రంగనాథన్ విషయంనికి వస్తే దర్శకుడిగా తన కెరియర్ మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా కూడా చలామణి అవుతున్నారు. అంతేకాదు యూట్యూబర్ కూడా.. 2019లో వచ్చిన ‘కోమాలి’ అనే సినిమాతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రదీప్ రంగనాథన్.. 2022లో వచ్చిన ‘లవ్ టుడే’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా ప్రదీప్ కు ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాహానికి ముందు లవర్స్ ఇద్దరూ ఫోన్లు మార్చుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి అనే విషయంపై చాలా చక్కగా సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు ఇదే కాన్సెప్ట్ తో నిజజీవితంలో కూడా చాలామంది ప్రేక్షకులు లవర్స్ తమ ఫోన్లను మార్చుకొని అసలు విషయాలు బయటపడి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
ప్రదీప్ రజనీకాంత్ స్టైల్ కి హీరోయిన్ ఫ్లాట్..
అలా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. ఇటీవల ‘డ్రాగన్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఇప్పుడు ఆకట్టుకున్నారు. ఇందులో గంధీ బత్ వెబ్ సిరీస్ హీరోయిన్ అన్వేషి జైన్(Anveshi Jain) హీరోయిన్గా నటించి.. తన అద్భుతమైన నటనతో అందరినీ అబ్బురపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో ప్రదీప్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) స్టైల్ లో అన్వేషి జైన్ ను ఆశ్చర్యపరిచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. షూటింగ్ లో భాగంగా కాస్త లంచ్ బ్రేక్ దొరకడంతో.. హీరో ప్రదీప్ రంగనాథన్ అక్కడున్న స్నాక్స్ ను రజినీకాంత్ స్టైల్ లో తిన్నారు. రజనీకాంత్ స్టైల్ లో స్నాక్స్ తింటున్న ప్రదీప్ ను చూసి ఒక్కసారిగా అన్వేషి జైన్ ఫిదా అయిపోయింది. వన్ మోర్ టైం వన్ మోర్ టైం అంటూ చాలా ఎక్సైట్మెంట్తో ప్రదీప్ ను అడగడం మనం చూడవచ్చు. మొత్తానికైతే రజినీకాంత్ స్టైల్ లో స్నాక్స్ తిన్న ప్రదీప్ రంగనాథన్ ని చూసి అన్వేషి జైన్ ఫిదా అయిపోయిందని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read:Chiranjeevi: శ్రీజ విడాకులపై తొలిసారి స్పందించిన చిరు.. ఏమన్నారంటే..?
అన్వేషి జైన్ కెరియర్..
అన్వేషి జైన్ విషయానికి వస్తే.. 1991 జూన్ 25న జన్మించిన ఈమె.. నటి మాత్రమే కాదు గాయని కూడా.. 2018లో వచ్చిన గంధీ బాత్ అనే వెబ్ సిరీస్ లో నటించి, తన నటనతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. తెలుగులో 2020లో వచ్చిన ‘కమిట్మెంట్’ అనే సినిమా ద్వారా అరంగేట్రం చేసిన ఈమె..ఆ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో నటించింది. ఇటు ‘మార్టిన్’ సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీకి కూడా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు గుజరాతీ సినిమాలో కూడా నటించింది. అలా ఆల్ రౌండర్ అనిపించుకున్న ఈమె ఇటీవల డ్రాగన్ సినిమాతో తమిళ్లో కూడా అడుగుపెట్టి ఆకట్టుకుంది.