HBD Varun Dhawan:ప్రముఖ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కుమారుడే. నాటిన్మం ట్రెంట్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన వరుణ్.. 2017 లో ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ అనే సినిమాతో కరణ్ జోహార్ (Karan Johar) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. ఒక 2012లో కరణ్ జోహర్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన ఈయన.. ఈ సినిమాతో ఉత్తమ డెబ్యూ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుకి నామినేట్ చేయబడ్డారు.
వరుణ్ ధావన్ సినిమా కెరియర్..
ఇక తర్వాత 2014లో ‘హంప్టీ శర్మాకీ దుల్హనియా’, 2015లో ‘ఏబిసిడి 2’ వంటి సినిమాలలో నటించారు. ఈ సినిమా ప్రపంచం మొత్తం మీద వన్ బిలియన్ వసూలు సాధించింది. ఆ తర్వాత అదే ఏడాది శ్రీరాం రాఘవన్ (Sriram Raghavan) దర్శకత్వం వహించిన ‘బద్లాపూర్’ సినిమాతో ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇకపోతే పంజాబీ – హిందూ కుటుంబంలో 1987 ఏప్రిల్ 24 న జన్మించారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఈ క్రమంలోనే ఆయన ఆస్తులు విలువ ఎంత అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
వరుణ్ ధావన్ ఆస్తుల విలువ..
వరుణ్ ధావన్ ఆస్తుల విలువ సుమారుగా రూ.381 కోట్లు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. 2017లో ముంబైలో సుమారుగా రూ.25 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశారు. ఇక రీసెంట్గా ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పిలవబడే జుహు ఏరియాలో కూడా రూ.86.92 కోట్ల విలువైన రెండు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు. ఇక అందులో ఒక అపార్ట్మెంట్ ను అద్దెకు ఇచ్చిన వరుణ్ ధావన్.. ఈ అద్దె అపార్ట్మెంట్ ద్వారా నెలకు రూ.8.5 లక్షలు లభిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కార్ కలెక్షన్స్..
ఇక ఈయన దగ్గరున్న కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఆడి q7, మెర్సిడెస్ బెంజ్ GLS, ల్యాండ్ రోవర్ LR 3 వంటి ఖరీదైన కార్లు ఈయన కార్ గ్యారేజ్ లో వున్నాయి
వరుణ్ ధావన్ సినిమాలు..
ఇకపోతే ఇటీవలే వరుణ్ ధావన్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కీలక పాత్ర పోషించిన ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సమంత యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టగా ఈమెతో సమానంగా వరుణ్ ధావన్ కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా రెడ్ కార్పెట్ పై వీరిద్దరూ జంటగా నడిచి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక వరుణ్ ధావన్ ఇప్పుడు మరో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్నట్లు సమాచారం.
ALSO READ:Janhvi Kapoor: ‘పరమ్ సుందరి’గా జాన్వీ కపూర్.. జోరు పెంచేసిన చిన్నది..!