BigTV English

Zero FIR: జానీ మాస్టర్‌ కేస్.. ఇంతకీ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఏ సందర్భంలో ఫైల్ చేస్తారో తెలుసా?

Zero FIR: జానీ మాస్టర్‌ కేస్.. ఇంతకీ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఏ సందర్భంలో ఫైల్ చేస్తారో తెలుసా?

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తాజాగా అత్యాచారం కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇంతకీ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎలాంటి సందర్భంలో ఈ కేసు నమోదు చేస్తారంటే..


What Is Zero FIR: గత రెండు రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తనపై పలుమార్లు అత్యాచారం చేయడంతో పాటు శారీరకంగా, మానసికంగా హింసించాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్, ఆయన భార్య తనను మతం మారాలంటూ చిత్రహింసలకు గురి చేశారంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ కేసును  నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

2013 నుంచి అమల్లోకి జీరో ఎఫ్ఐఆర్


మనం సాధారణంగా  ఎఫ్‌‌ఐఆర్ అనే పదాన్ని వింటాం. పోలీస్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ప్రాథమిక సమాచారంతో నిందితులపై  కేసు నమోదు చేయడాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. అయితే, జీరో ఎఫ్‌‌ఐఆర్ గురించి చాలా మందికి తెలియదు. 2013 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినా, ప్రజలకు దీని గురించి అంతగా తెలియదు. కొద్ది సంవత్సరాల క్రితం నార్సింగి సమీపంలో వెటర్నటీ డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచారం, హత్య కేసు సమయంలో జీరో ఎఫ్ఐఆర్ మీద విస్తృత చర్చ జరిగింది. తమ కూతురు కనిపించడం లేదంటూ, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే తమ పరిధికాదంటూ శంషాబాద్, శంషాబాద్ రూరల్ పోలీసులు తీసుకోలేదు. అప్పట్లో పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి వ్యవహారాలు చాలా పోలీస్ స్టేషన్లలో జరుగుతూనే ఉంటాయి.

Also Read: జానీ మాస్టర్ అలాంటోడే… అమ్మాయిలతో అలా ప్రవ్తర్తించడం చాలా కామన్..

జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి?

ఒక నేరం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా బాధితుల ఫిర్యాదు చేసిన పీఎస్ లోనే కేసు నమోదు చేయడాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. అంటే బాధితులు దగ్గర్లో ఉన్న ఏ పోలీస్ స్టేషన్ లోనైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు తమ పీఎస్ పరిధిలోనే నేరం జరిగితే సాధారణ ఎఫ్ఐఆర్.. ఇతర పోలీస్ స్టేషన్ పరిధిలో నేరం జరిగితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ తర్వాత సంబంధిత స్టేషన్ ఏదో తెలుసుకుని ఆ ఎఫ్‌ఐ‌ఆర్‌ను అక్కడికి బదిలీ చేయాలి. తమ పరిధి కాదు అని చెప్పడానికి అవకాశం లేదు. ఒకవేళ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీసులు నిరాకరిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

జీరో ఎఫ్ఐఆర్ లక్ష్యం ఏంటి?

కేసు నమోదు విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండకూదడనే ఉద్దేశంతోనే జీరో ఎఫ్ఐఆర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధి తెలియక బాధితులు ఇబ్బంది పడకూడదనేదే  దీని లక్ష్యం. బాధితులు ఇచ్చిన సమాచారాన్ని తీసుకుని వెంటనే కేసు నమోదు చేయడంతో పాటు సంబంధిత స్టేషన్ ను అలర్ట్ చేయాలి. విచారణ మొదలయ్యేలా చర్యలు చేపట్టాలి. కేసును బదిలీ చేసి అక్కడి నుంచి విచారణ ముందుకుసాగేలా చూడాలి.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×