BigTV English

Prasanth Varma: సినిమాటిక్ యూనివర్స్ కోసం మాస్టర్ ప్లాన్.. రణవీర్ వద్దన్నాడని ప్రశాంత్ అలాంటి నిర్ణయం..

Prasanth Varma: సినిమాటిక్ యూనివర్స్ కోసం మాస్టర్ ప్లాన్.. రణవీర్ వద్దన్నాడని ప్రశాంత్ అలాంటి నిర్ణయం..

Prasanth Varma: తెలుగు ఆడియన్స్‌కు సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసిందే ప్రశాంత్ వర్మ. అందుకే ఈ యంగ్ డైరెక్టర్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ‘హనుమాన్’ అనే సినిమాతో తను తీసుకున్న రిస్క్.. తనను సౌత్‌లో మాత్రమే కాదు.. నార్త్‌లో కూడా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌ను చేసేసింది. అందుకే చాలామంది బాలీవుడ్ హీరోలు సైతం ప్రశాంత్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తన సినిమాటిక్ యూనివర్స్ కోసం పక్కా ప్లానింగ్‌ను సిద్ధం చేసుకుంటున్నాడు. అందులో ఏ సినిమా ఎప్పుడు రావాలి, అందులో ఏ యాక్టర్స్ ఉండాలి అని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. రణవీర్ వద్దన్న కథను మరో తెలుగు హీరోకు చెప్పి ఓకే చేయించాడట ప్రశాంత్.


తెలుగు హీరోతోనే

ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తన సినిమాటిక్ యూనివర్స్‌లో బాలీవుడ్ హీరో అయిన రణవీర్ సింగ్‌ (Ranveer Singh)ను భాగం చేయాలనుకున్నాడు. అందుకోసమే వీరిద్దరి మధ్య చాలా స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయి. వీరిద్దరి ప్రాజెక్ట్ దాదాపు ఓకే అని అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. కానీ ఇంతలోనే ఏమైందో తెలియదు.. ప్రశాంత్, రణవీర్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఆ సమయంలో ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా స్టోరీలు కూడా ఇన్‌డైరెక్ట్‌గా ఎవరికో కౌంటర్ ఇస్తున్నట్టుగా అనిపించేవి. దీంతో రణవీర్, ప్రశాంత్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో నమ్మకం పోయింది. అందుకే ఇప్పుడు ఇదే కథతో ఒక తెలుగు హీరోను ఒప్పించాడట ఈ యంగ్ డైరెక్టర్.


వెరీ బిజీ

మొత్తానికి ప్రశాంత్, రానా (Rana) కలిసి సినిమా చేసే సమయం వచ్చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. రణవీర్‌తో ప్రశాంత్ చేయాల్సిన ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను ఇప్పుడు రానాతో చేయాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం రానా చేతిలో హీరోగా పెద్దగా సినిమాలు ఏమీ లేవు. కానీ ప్రశాంత్ మాత్రం వరుస కమిట్మెంట్స్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తను రక్షిత్ శెట్టితో ‘జై హనుమాన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంది. ఇవన్నీ పూర్తయిన తర్వాతే రానాతో ‘బ్రహ్మ రాక్షస’ మొదలయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ మిస్సింగ్ కలకలం… టెన్షన్ లో ఫ్యామిలీ

అన్నీ ఆగిపోయాయి

గత కొంతకాలంగా రానాకు హీరోగా అంతగా లక్ కలిసి రావడం లేదు. ఇప్పటికే డైరెక్టర్ తేజతో కలిసి ‘రాక్షస రాజా’ అనే మూవీ చేస్తున్నట్టుగా అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. ప్రస్తుతం తన కుమారుడి డెబ్యూ మూవీలో తేజ కూడా బిజీ అయిపోయారు. అది కాకుండా గుణశేఖర్‌తో కలిసి ‘హిరణ్యకశిపు’ అనే హిస్టారికల్ మూవీ చేయాలనుకున్నాడు రానా. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ ప్లాన్ చేయగా పలు కారణాల వల్ల ఇది కూడా ఆగిపోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. ప్రస్తుతం రానా.. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా బిజీగా గడిపేస్తున్నాడు. దాంతో పాటు ఒక టాక్ షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×