Tollywood: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు చాలా సెలెక్టివ్ గా పాత్రలు చేస్తే.. మరి కొంతమంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే సేమ్ ఏజ్ హీరోలలో ఒకరితో రొమాన్స్ చేస్తే.. ఇంకొకరికి తల్లిగా.. ఇంకొకరికి అక్కగా లేదా వదినగా ఇలా క్యారెక్టర్ డిమాండ్ ను బట్టి నటిస్తూ ఉంటారు. అలా ఒక హీరోయిన్ వెంకటేష్ (Venkatesh)తో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత అదే హీరోయిన్ చిరంజీవి (Chiranjeevi) కి అక్కగా, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి తల్లిగా కూడా నటించి అబ్బరపరిచింది. మరి ఆమె ఎవరు..? వీరితో నటించిన ఆ చిత్రాలేంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు అందాల తార సీనియర్ హీరోయిన్ ఖుష్బూ(Khushboo).. ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా తన అందాలతో అందరినీ తన వశం చేసుకుంది. ముఖ్యంగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఖుష్బూ బుల్లితెర షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎంతోమంది కుర్రాళ్ళ ఆరాధ్య దేవత ఖుష్బూ.. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. దగ్గుబాటి వెంకటేష్ తొలి సినిమా అయిన ‘కలియుగ పాండవులు’ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్టుగా నిలిచింది. అటు వెంకటేష్ సినిమా కెరియర్ కు మంచి పునాది పడగా.. ఇటు ఖుష్బూకి కూడా తెలుగు, తమిళ్ భాషా చిత్రాలలో వరస అవకాశాలు తలుపు తట్టాయి.అందులో భాగంగానే తెలుగు, తమిళ్ భాషల్లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి అభిమానులను మెప్పించింది.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఖుష్బూ తల్లి, అత్త వదిన వంటి పాత్రలలో నటిస్తూ కూడా అలరిస్తోంది అంతేకాదు మరొకవైపు రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటోంది ఖుష్బూ. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’సినిమాలో పవన్ కళ్యాణ్ కి సవతి తల్లిగా నటించింది. అటు చిరంజీవి హీరోగా నటించిన ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవికి అక్కగా కూడా నటించింది. అలా ఈ హీరోలకు అక్కగా, తల్లిగా చేసి.. వెంకటేష్ తో రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఖుష్బూ వైవాహిక జీవితం..
ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన సుందర్ ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో యంగ్ హీరోల సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్న ఖుష్బూ ఎక్కువగా తల్లి పాత్రలకే ఓటేస్తోంది అని చెప్పవచ్చు. అలాగే జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఈమె అక్కడ కూడా తన అందంతో అందరిని ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా సీనియర్ హీరోయిన్స్ అంతా కూడా ఇప్పుడు మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే నటన పైన వీరికి ఉన్న ఆసక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి ఇలాంటి నటీమణులు ఇప్పటికీ కూడా శ్రమిస్తున్నారు.