Kerala Crime News: కేరళలో ఘోరం జరిగింది. కని పెంచిన తల్లిని కిరాతకంగా యువకుడు. డ్రగ్స్ కు బానిసై గొంతుకోసి ప్రాణం తీశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని.. తనకు జన్మనిచ్చినందుకే ప్రాణం తీస్తున్నట్లు చెప్పడం అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేరళలోని తమరసేరి సమీపంలోని పుత్తుప్పడిలో 25 ఏండ్ల ఆషిక్.. తాజాగా తన తల్లిని గొంతుకోసి చంపేశాడు. డ్రగ్స్ కు బానిసైన ఆ యువకుడు తన తల్లి సుబైదా కైక్కల్(53)ను తనకు జన్మనిచ్చినందుకే ప్రాణం తీసినట్లు చెప్పడంతో అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. అష్టకష్టాలు పడి పెంచిన తన ఒక్కగానొక్క కొడుకు కొడవలితో మెడను నరికి చంపడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. డ్రగ్స్ కు బానిసైన ఆషిక్.. తల్లిన తరచుగా డబ్బులు అడిగేవాడు. తాజాగా వారిద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవ అయ్యింది. ఉన్న ఆస్తిని అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిపై ఒత్తిడి చేశారు. అమె ఒప్పుకోకపోవడంతోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తన తల్లిని చంపాలనుకుంటున్నట్లు చాలా మందికి చెప్పడంతో పాటు ఇప్పటికి రెండుమూడు సార్లు హత్య చేయడానికి ప్రయత్నించాడని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన సమయంలో అతడు డగ్స్ తీసుకున్నాడా? లేదా? అని తెలుసుకునేందుకు అతడి బ్లడ్ శాంపిల్స్ పరీక్షలకు పంపినట్లు వెల్లడించారు. రీసెంట్ గా బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేయించుకుని, తన సోదరి ఇంట్లో ఉంటున్న సుకైదాను ఆషిక్ హత్య చేశాడు.
అష్టకష్టాలు పడి ఆషిక్ ను పెంచిన తల్లి
సుఖైదా 23 ఏండ్ల వయసులోనే తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పుడు ఆషిక్ కు కేవలం 2 సంవత్సరాల వయసు. అప్పటి నుంచి ఆమే అతడిని పెంచింది. పెళ్లిళ్లు, వేడుకల్లో వంట పనిలో సాయం చేస్తూ.. డబ్బులు సంపాదించేది. ఆ పైసలతో ఆషిక్ ను పెంచింది. ప్లస్ టూ తర్వాత ఆషిక్ ఆటో మోబైల్ ఇంజినీరింగ్ లో చేరాడు. అప్పటి వరకు బాగానే ఉన్న అతడు, కొత్త ఫ్రెండ్స్ పరిచయంతో అడ్డదారులు తొక్కాడు. డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచే డబ్బుల కోసం ఇంట్లో తల్లిని వేధించేవాడు. రోజూ తల్లితో గొడవ పడేవాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో నానా రభస చేసేవాడు.
డి-అడిక్షన్ సెంటర్ లో చేర్చించిన తల్లి
డ్రగ్స్ కు బానిస కావడంతో ఆషిక్ ను బెంగళూరులోని ఓ డి-అడిక్షన్ సెంటర్ లో చేర్పించింది. మామూలు మనిషి కావడానికి రూ. 5 లక్షలు ఖర్చు చేసింది. 10 నెలల చికిత్స తర్వాత ఈ మధ్యే ఇంటికి వచ్చాడు ఆషిక్. ఆషిక్ అప్పుడప్పుడు హెల్పర్ గా లేదంటే రోజువారీ కార్మికుడిగా పనికి వెళ్లేవాడు. అతడి తల్లికి ఈ మధ్య బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయ్యింది. దీంతో ఆమె తన చెల్లి ఇంట్లో ఉంటూ కొలుకుంటున్నది. తాజాగా ఆమె ఇంటికి వెళ్లి డబ్బు కోసం గోల చేసిన ఆషిక్.. తన వెంట తెచ్చుకున్న కొడవలితో తన తల్లి మెడను నరికి చంపేశాడు. తనను జన్మనిచ్చినందుకు ఆమెను చంపేస్తున్నట్లు చెప్పడం అందరినీ షాక్ కి గురి చేసింది. పోస్టు మార్టం అనంతరం బంధువులు సుఖైదా అంత్యక్రియలు నిర్వహించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Read Also: లోపల ప్రియురాలి పెళ్లి, బయట ప్రియుడి సజీవదహనం.. ఇంతకీ హత్యా? ఆత్మహత్యా?