Glycerin For Skin: ముఖం అందంగా కనిపించడం కోసం అమ్మాయిలు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల స్కిన్ కేర్ టిప్స్ పాటించే వారు చాలా మందే ఉంటారు. ఇంకొంతమంది బ్యూటీ ప్రొడక్ట్స్ ట్రై చేస్తుంటారు. ముఖంపై నల్ల మచ్చలు పోయి అందంగా కనిపించడానికి రకరకాల హోం రెమెడీస్ కూడా వాడవచ్చు. ముఖ్యంగా గ్లోయింగ్ స్కిన్ కోసం గ్లిజరిన్ చాలా బాగా పనిచేస్తుంది. గ్లిజరిన్ లో కాఫీ ఫౌడర్ కలిపి ఫేస్ ప్యాక్‌లాగా చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మరి గ్లిజరిన్ తో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లిజరిన్, కాఫీ పౌడర్‌తో ఫేస్ ప్యాక్:
కాఫీ పౌడర్ తో పాటు గ్లిజరిన్ మిశ్రమం చర్మానికి ముఖ్యంగా టానింగ్ , మచ్చలను తొలగించడానికి ఒక గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది.
ఈ ఫేస్ అప్లై చేయడానికి ముందుగా మీ చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేయండి. ఇందుకోసం లైట్ ఫేస్ వాష్‌ని ఉపయోగించడం వల్ల మురికి, జిడ్డు తొలగిపోయి చర్మంపై ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఉంటాయి. ఈ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేయడానికి ముందుగా మీ చర్మాన్ని తక్కువ pH ఉన్న క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోండి. దీంతో మురికి, జిడ్డు తొలగిపోయి చర్మంపై ఎలాంటి మురికి ఉండదు.
కాఫీ చర్మానికి గొప్ప ఎక్స్‌ఫోలియేటర్. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి 1-2 చెంచాల కాఫీ పౌడర్ తీసుకుని దానికి కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ గ్లిజరిన్ కలపండి. తర్వాత ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ మిశ్రమం మీ ముఖం నుండి టానింగ్, డార్క్ స్పాట్స్ , మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇది మీ ముఖంపై ఉన్న మచ్చలను కూడా తొలగిస్తుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం గ్లిజరిన్ ఉపయోగించడం మంచిది.
Also Read: ఖరీదైన ఫేస్ క్రీములు అవసరమే లేదు, వీటితో మచ్చలేని చర్మం
గ్లిజరిన్‌లో పసుపు కలిపి వాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది. పసుపులోని ఔషద గుణాలు ఉంటాయి. ఇవి ముఖంపై మచ్చలను తొలగిస్తాయి. 1 టీ స్పూన్ గ్లిజరిన్ లో 1 /2 టీ స్పూన్ పసుపు కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల పాటు ఇలాగే ఉంచి తర్వాత ముఖాన్ని శుభ్రం చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మచ్చలు త్వరగా తొలగిపోవాలంటే వీటిని వాడటం అలవాటు చేసుకోవాలి.